రవితేజ హీరోగా అంతర్థానం..


రవితేజ.. మాస్ మహారాజ ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.. తాను డైరెక్షన్ చేస్తానని.. కానీ అది ఎప్పుడో చెప్పలేనంటూ చేసిన వ్యాఖ్యలు బలాన్ని చేకూర్చాయి.. రవితేజ హీరోగా చేయడం మానుకోవాలనుకుంటున్నాడని అతడి అంతరంగికుల మాట.. తొందరలోనే హీరోగా అంతర్థానమై.. దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఫిలింనగర్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి..

రవితేజ నిర్ణయంలో తప్పులేదు.. ఎందుకంటే గడిచిన రెండేళ్లుగా ఆయన సరైన హిట్ లు లేవు. అవే మూస కథలతో ప్లాపుల మీద ప్లాపులు వచ్చిపడ్డాయి. కిక్ సినిమా హిట్ తర్వాత ఎంత ప్రయత్నించినా.. గొప్ప దర్శకులతో చేసినా రవితేజకు సరైన హిట్ పడలేదు. అంతకుముందు రాజమౌళి విక్రమార్కుడు సినిమా ఆయన జీవితంలోనే పెద్ద హిట్. అలాంటి రవితేజకు ఇప్పుడు హిట్ లు కరువయ్యాయి. సురేందర్ రెడ్డి వంటి గొప్ప దర్శకుడితో కిక్ 2 తీసినా అదీ ప్లాప్ అయ్యింది. బలుపు, దరువు లాంటి ఎన్నో సినిమాలు ప్లాపులయ్యాయి.. దీంతో హీరోగా రవితేజ రిటైర్ అయిపోవాలని డిసైడ్ అయ్యాడట..

హీరోల అంతర్థానం ఇప్పుడే కాదు దిగ్గజ హిట్ లు కొట్టిన ఎందరో సినిమాల్లో నిలబడలేక.. సరైన హిట్ లు లేక సినిమాలను వదిలేశారు. తొలినాళ్లలో హిట్ లు ఇచ్చిన తరుణ్, ఉదయ్ కిరణ్, తారకరత్న లు ఇలానే ఇండస్ట్రీలో హిట్ లేక కనుమరుగైపోయారు. ఖాళీగా ఉంటున్నారు. వేరే బిజినెస్ లు చూసుకుంటున్నారు. ఇప్పుడు రవితేజ కూడా అదే బాటలోకి వెళ్లిపోతున్నారు. హీరోగా వదిలేసి డైరెక్టర్ గా కొనసాగాలనుకుంటున్నాడు. రవితేజ సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ గా చేశాడు. ఆ తర్వాత లక్కీగా హీరోగా ఎదిగాడు. ఆ అనుభవంతోనే మళ్లీ డైరెక్టర్ గా చేసేందుకు రెడీ అయిపోతున్నాడట.. ఈ రంగుల ప్రపంచంలో ఎవరు నిలబడతారో.. పడతారో తెలియదు.. స్టార్ డం ఎప్పటికీ సాధ్యం కాదు. అందుకు రవితేజనే ఉదాహరణ.. ఇలా మరో అగ్ర హీరో అంతర్థానం ఖాయమైపోయిందన్నమాట..

To Top

Send this to a friend