రజినీకాంత్ అల్లుడు అసలు ఎవరి కొడుకు.?


ప్రఖ్యాత హీరో రజినీకాంత్ అల్లుడు ధనుష్ కు టైం అస్సలు బాగాలేదు. వచ్చే ఉగాది తర్వాత ఆయన పంచాంగం చూపెట్టుకొని ఏదైనా గ్రహశాంతి చేయించాలి.. లేకపోతే ఈ అపనిందలు, అపఖ్యాతులు ధనుష్ కు తప్పేలా లేవు..

మొన్నీ మధ్యే గాయని సుచిత్ర సుచీలీక్ పేరిట ధనుష్ వేరే అమ్మాయిలతో చేసిన రాసలీలలు.. సుచిత్రను రేప్ చేశారంటూ చెలరేగిన నిందలకు పాపం.. ఎక్కడ తలెత్తుకోలేకపోయాడట.. మీడియాకు కూడా దూరమైపోయాడు. ఇంట్లో భార్యతో గొడవలు అయ్యాయో లేదో తెలియదు.. కానీ ప్రస్తుతం ఎక్కడ కనిపించడం లేదు ధనుష్..

ఆ వివాదం ఇంకా మసులుతూనే ఉండగానే.. మరో వివాదంలో ధనుష్ ఇరుక్కుపోయాడు. ధనుష్ తమ కొడుకే అని మధురై కు చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు కోర్టులో ఫిర్యాదు చేశారు. చిన్పప్పుడే పారిపోయాడని.. అతడి ఫొటోలు, ఇతర ఆధారాలను కోర్టు ముందుంచారు. తల్లిదండ్రులు చెప్పిన మచ్చలు ఉన్నాయో లేదో చూడాలని ధనుష్ ను వైద్యులు పరీక్షించాగా.. లేజర్ ట్రీట్ మెంట్ తో ధనుష్ పుట్టుమచ్చలు తొలిగించుకున్నట్టు తేలింది. ఆ నివేదికను కోర్టుకు వైద్యులు సమర్పించారు. దీంతో కదిరేషన్-మీనాక్షిల బిడ్డే ధనుష్ అనే అనుమానాలు బలపడ్డాయి. కేసు విచారణను కోర్టు ఏప్రిల్ 11కు వాయిదా వేసింది..

కాగా ఈ స్టోరీలో అసలు ట్విస్ట్ ఏంటంటే.. ధనుష్ తల్లిదండ్రులు ధనుష్ తమ కుమారుడేనని కోర్టులో కేసు వేశారు. వృద్దాప్యంలో తమను చూసుకోవాలని.. నెలకు 60వేల భృతిని ధనుష్ తమకు ఇవ్వాలని వారు కోర్టుకు విన్నవించారు. అంటే ధనుష్ తల్లిదండ్రులమని చెప్పి వీళ్లు డబ్బుల కోసమే ఈ కేసు వేశారనే విషయం తేటతెల్లమైంది.

కాగా ధనుష్ దర్శక, నిర్మాత కాస్తూరి రాజా పెద్ద కొడుకు. అనంతరం టాప్ హీరోగా ఎదిగి రజినీకాంత్ ఇంటి అల్లుడయ్యాడు. 2002లోనే ఆయన దర్శకత్వంలోనే ధనుష్ తల్లువాదో ఇల్లమయి అనే సినిమాలో సినీ రంగ ప్రవేశం చేసి ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద స్టార్ గా ఎదిగాడు.

To Top

Send this to a friend