రంగుల లోకంలో విహరిద్దామని వచ్చి, దారుణంగా రేప్ కు గురై..

సినిమా అవకాశాల కోసం వచ్చిన అమాయక అమ్మాయిలు దారుణంగా మోసపోతూనే ఉన్నారు.. రంగుల లోకం హీరోయిన్ అవ్వాలని వచ్చిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన యువతి పదోతరగతి పూర్తికాగానే హైదరాబాద్ లో ఉన్న మావయ్య ఇంటికి వచ్చింది. సినిమా అవకాశాల కోసం ఆత్రంగా ఫిలింనగర్ లో చక్కర్లు కొట్టింది. దీన్నే సదావకాశంగా మలుచుకున్న కొందరు సినీ అసిస్టెంట్ డైరెక్టర్లు ఆమెను మాయమాటలతో నమ్మించి 17 రోజుల పాటు అత్యాచారం జరిపారు.
హైదరాబాద్ ఇందిరానగర్ కు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్లు షేక్ అక్బర్, తూము వెంకారెడ్డి, నండూరి పాపారావు, నవీన్ కుమార్ లు యువతిని హీరోయిన్ ను చేస్తామని నమ్మించారు. ఆమెను రంగారెడ్డి జిల్లా నందిగామ తీసుకెల్లి అందరూ సామూహిక అత్యాచారం చేవారు. 17రోజులుగా బాలికపై రేప్ చేస్తుండడంతో ముభావంగా ఉంటోంది. ఇది గమనించిన యువతి మావయ్య ప్రశ్నించడంతో బాలిక బోరుమని విలపించింది. దీంతో యువతి, మావయ్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది..

To Top

Send this to a friend