య‌ప్ టీవీ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మ‌హేష్ బాబు..!

yuptv-mahesh-apnewsonline

ద‌క్షిణాసియా కంటెంట్ ను క‌లిగిన ప్ర‌పంచ‌పు అతి పెద్ద ఆన్ లైన్ స్ట్రీమింగ్ వేదిక అయిన‌టువంటి య‌ప్ టీవీ టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబును బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ప్ర‌క‌టించింది. ఓ టీటీ (ఓవ‌ర్ ది టాప్) స్పేస్ లో ప్ర‌పంచ దిగ్గ‌జ‌మైన య‌ప్ టీవీ 12కు పైగా ప్రాంతీయ భాష‌ల్లో ద‌క్షిణాసియా కంటెంట్ ను అందిస్తుంది. ఈ తాజా ప్ర‌క‌ట‌న‌తో య‌ప్ టీవీ ఆయ ప్రాంతాల్లో త‌న ఆద‌ర‌ణ ఏ స్ధాయిలో పెరుగుతుందో నిరూపించేందుకు మొద‌టి అడుగు.

మ‌హేష్ బాబు సినిమా రంగంలో చాలా ప్ర‌ముఖ‌మైన సెల‌బ్రెటీ. గ‌తంలో టైమ్స్ మోస్ట్ డిజైర‌బుల్ మెన్ స‌ర్వేలో ఆయ‌న బాలీవుడ్ సెల‌బ్రిటీల స‌ర‌స‌న నిలిచారు. మ‌న‌సు దోచుకునే ఆయ‌న అందం మ‌రియు వ్య‌క్తిత్వం ఆధునాత‌న సాంకేతిక‌త‌ను ఉప‌యోగించి ద‌క్షిణాసియా వీడియోల‌ను ప్రపంచానికి అందిస్తోన్న య‌ప్ టీవీతో మ‌రింత ఇనుమ‌డిస్తాయి.

ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు మాట్లాడుతూ…ద‌క్షిణాసియా కంటెంట్ ను అందించేటువంటి య‌ప్ టీవీ ఓ టీటీ స్పేస్ లో మార్గ‌ద‌ర్శిగా నిలిచింది. ఎప్పుడైనా ద‌క్షిణాసియా కంటెంట్ వీడియోల‌ను ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచి చూడాల‌నుకునే వారికి య‌ప్ టీవీ వాటిని చేరువ చేసింది. వాటిని చూస్తూ వీక్ష‌కులు త‌మ ఇళ్లు లేదా ప్రాంతంలో ఉన్న‌ట్లు అనుభూతి పొందుతారు. ఎంట‌ర్ టైన్ మెంట్ లో నా మొద‌టి ఛాయిస్ య‌ప్ టీవీ. నాక తెలిసి వినోదం యొక్క భ‌విష్య‌త్తు ఆన్ లైన్ వీడియో స్ర్టీమింగ్ రంగంలోనే ఉంటుంది. అలాంటి రంగంలో ఎంతో ముందున్న‌టు వంటి య‌ప్ టీవీతో అనుబంధం కుదుర్చుకోవ‌డం నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది. ఆరు సంవ‌త్స‌రాల క్రితం దూకుడు సినిమా షూటింగ్ టైమ్ లో విదేశాల్లో ఉన్న‌ప్పుడు ఓ నిర్మాత త‌న ఫోన్ లో న్యూస్ ఛాన‌ల్ చూస్తున్నాడు. ఫోన్ లో న్యూస్ ఛాన‌ల్ ఎలా చూడ‌గ‌లుగుతున్నారు అని నేను  అడిగితే య‌ప్ టీవీ ద్వారా అని చెప్పాడు. అప్పుడు అద్భుతం అనిపించింది. ఇప్పుడు నేను అద్భుతం అనిపించిన య‌ప్ టీవీతో అసోసియేట్ అవ్వ‌డం చాలా సంతోషంగా, గ‌ర్వంగా ఉంది అన్నారు.

య‌ప్ టీవీ సీఈఓ, వ్య‌వ‌స్ధాప‌కులు ఉద‌య్ రెడ్డి మాట్లాడుతూ… ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ద‌క్షిణాసిమా వీడియో కంటెంట్ ను కోరుకునే వీక్ష‌కుల‌కు న‌చ్చిన వీడియోల‌న్నింటినీ అందిస్తూ ఓ టీటీ స్పేస్ లో అగ్ర‌గామిగా నిలిచిన య‌ప్ టీవీ గ‌త కొన్నేళ్లుగా అద్భుత‌మైన ఘ‌ణ‌నీయ‌మైన అభివృద్దిని న‌మోదు చేస్తుంది. మా యి ప్ర‌యాణంలో మా బ్రాండ్ ను మ‌రింత ముందుకు తీసుకెళ్లేందుకు భార‌త్ తో పాటు విదేశాల్లోనూ ఎక్కువ మంది అభిమానుల‌ను సంపాదించుకున్న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో అనుబంధం కుదుర్చుకున్నాం. ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌రింత మందికి మా బ్రాండ్ ను విస్త‌రింప‌చేసేందుకు ఈ బంధం ఉప‌యోగ‌ప‌డుతుంది అన్నారు.

To Top

Send this to a friend