యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ సౌత్ ఇండియా: పవన్

‘నల్లవాళ్లయిన దక్షిణాది ప్రజలతో ఉత్తరాది వాళ్లం మేం జీవించడం లేదా’ అని దక్షిణాది ప్రజలను అవమానించిన బీజేపీ నేత ఆ పార్టీ మాజీఎంపీ తరుణ్ విజయ్ మాటలపై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. సదురు ఎంపీ మాటలను ఉటంకిస్తూ ట్వీట్ల రూపంలో ఎండగట్టారు. పవన్ ట్వీట్లు కింద చూడొచ్చు..

* నల్లగా ఉన్నదని వద్దనుకుంటే కోకిలను నిషేధించే ఘటికులు మీరు.. మీరు ఎగురవేసే జాతీయ పతాకం ఒక దక్షిణాది మహనీయుడి రూపకల్పనే..

*నల్లగా ఉన్న దక్షిణ భారతీయులు ఇచ్చే రెవెన్యూ కావాలి మీకు.. కానీ వాళ్ల మీద చిన్న చూపు మీకు.. ఈ రకమైన భావజాలం ఉన్న వ్యక్తులు.. వాళ్లకి చోటు ఇచ్చే పార్టీలు జాతీయ స్థాయిలో ఉండటం మన దౌర్భాగ్యం..

*ఉత్తరాది అహంకారం మొత్తం మీ మాటల్లోనే కనిపిస్తోంది. క్షమాపణలు చెప్పినంత మాత్రాన మరిచిపోయే అవమానం కాదిది..

*ఇలాంటి వివక్షలు జాతిని గీతలు గీసి మరీ విడదీస్తాయి..

అంతేకాదు పవన్ ఈ సందర్భంగా ఉత్తరాది అహంకారినికి నిరసనగా అమెరికా తరహాలో యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ సౌత్ ఇండియా పేరిట ఓ ఉద్యమం లాంటి పోస్టర్ ను ట్విట్టర్ లో ఉంచి సంచలనం సృష్టించారు. ఇందులో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలున్నాయి. ఇది గనుక తీవ్ర రూపం దాల్చితే ఉత్తరాది అహంకారం ఇలాగే కొనసాగితే.. ఇండియాలో ఉత్తర, దక్షిణ భారత దేశాల మధ్య పెద్ద లొల్లి జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పవనా మాజాకా ఒక్క ట్వీట్ తో బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు.

To Top

Send this to a friend