యూత్‌ఫుల్‌గా `బ‌లపం ప‌ట్టి భామ ఒడిలో`

????????????????????????????????????

ర‌ష్మీగౌత‌మ్, శాంత‌న్ జంట‌గా న‌టించిన ఓ త‌మిళ చిత్రం తెలుగులో `బ‌ల‌పం ప‌ట్టి భామ ఒడిలో` అనే పేరుతో అనువాద‌మైంది. `అ ఆ ఇ ఈ` అనేది  ఉప‌శీర్షిక‌. దుర్గం గిరీష్ బాబు స‌మ‌ర్పిస్తున్నారు. నాగహృషీ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. సంతానం, ఆశిష్ విద్యార్థి, విజ‌య్ కుమార్ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. విజ‌య్ గ‌జ‌గౌని నిర్మాత‌. ఎ.సి.ముగిల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ “క‌థ చాలా యూత్‌ఫుల్‌గా సాగుతుంది. యువ‌త‌కు న‌చ్చేలా భార‌తీబాబు మంచి డైలాగులు రాశారు. ర‌ష్మీ గౌత‌మ్‌కి తెలుగులో ఉన్న క్రేజ్ తెలిసిందే. ఈ సినిమాలో ఆమె న‌ట‌న అంద‌రినీ  అల‌రిస్తుంది. అనువాద ప‌నులు పూర్త‌య్యాయి. విజ‌య్ ఎబింజ‌ర్ సంగీతం ఆక‌ట్టుకుంటుంది. సెప్టెంబ‌ర్ 9న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అని అన్నారు. ఈ సినిమాకు సంగీతం:  విజ‌య్ ఎబింజ‌ర్‌, ర‌చ‌న‌:  భార‌తీబాబు, క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌: క‌ర‌ణ మ‌ల్తుమ్‌క‌ర్‌, స‌హ నిర్మాత‌:  కె.మాధ‌వ్‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌లు:  కె.నాగ‌రాజ్ గైడ్‌, ర‌మేష్ కైగూరి.
To Top

Send this to a friend