యుగపురుషుడా.. మళ్లీ పుట్టవా..?

దేవుడికంటూ రూపం లేదు. ఆయన వేసిన పాత్రలను చూసి దేవుడంటే ఇలాగే ఉంటాడని జనం భావించారు. కలియుగ దేవుడిగా సీనియర్ నందమూరి తారక రామా రావును కీర్తించారు. పురుషోత్తమునికి తెరపై ప్రాణప్రతిష్ట చేస్తే ఆయనలా ఉంటారు.. అంత మహానుభావుడి జన్మదినం నేడు..

ఎన్టీఆర్ తెలుగు సినిమాకు చుక్కాని.. తెలుగు సినిమా మొదలైనప్పటి నుంచి ఆయన తెలుగువారితోనే ఉన్నారు. సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఆంధ్రుల అభిమాన ‘అన్నగారు’గా మారారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వేదికగా చాటారు. 9 నెలల్లో కాంగ్రెస్ ను పాతరేసి తెలుగుదేశాన్ని అధికారంలోకి తెచ్చారు.

ఎన్టీఆర్ సినీరంగ ప్రవేశం నుంచి చివరి సినిమా వరకు, రాజకీయాల్లోకి మారాక కూడా విలువలు పాటిస్తూ ఆంధ్రుల గుండెల్లో నిలిచిపోయారు. ఎన్టీఆర్ లోని నటుడిని, దర్శకుడిని నిర్మాతను, కళాకారుడిని, మానవాతమూర్తిని, ప్రయోగశీలిని, వితరణశీలిని, అభ్యుదయ వాదిని, దార్శనికుడిని తెలుగు ప్రజలు ఎన్నటికీ మరిచిపోరు. . అందుకే ఆయన మనతో లేకున్నా ఆ యుగ పురుషుడిని మన స్మరించుకుంటూనే ఉంటాం..

నందమూరి తారకరామారావు జన్మదినం సందర్భంగా ఆయన జయంతి ని తెలుగు సినీ పరిశ్రమ, తెలుగు వారు ఘనంగా జరుపుకుంటున్నారు.

To Top

Send this to a friend