మోహన్ లాల్ పులిమురుగన్ కి ఫుల్ క్రేజ్

pulimurugan-malayalam-movie-stills-apnewsonline
మళయాలంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం పులిమురుగన్. మల్లూవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్ నటించిన ఈ విజువల్ వండర్ దసరా కానుకగా అక్టోబర్ 7న విడుదల కాబోతుంది.  మళయాలనట ఎన్నడూ లేని రీతిన కేవలం అభిమానులు కోసమే 100 ప్రీ స్క్రీనింగ్స్ వేయడం విశేషం. అలానే ఈ సినిమాలో తన పోషించిన పాత్ర కోసం మోహనలాల్ భారీ కసరత్తలు చేసి బరువు తగ్గారు. మల్లూవుడ్ లో బిగ్గెస్ట్ ఎవర్ సినిమాగా రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో జగపతిబాబు విలన్ గా నటించారు. కమలిని ముఖర్జీ హీరోయిన్ కాగా, బబ్లీ బ్యూటీ నమిత ఓ కీలక పాత్ర పోషించారు. ఇక దాదాపు 28 కోట్ల బడ్జెట్ తో 2 సంవత్సరాలకి పైగా ఈ సినిమా నిర్మించినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ సినిమా పతాక సన్నివేశాల్ని కోసం ఫేమెస్ ఫైట్ మాస్టర్ పీటర్ హేన్స్ 42 రోజులు పాటు కేరళ, వియత్నాంలో చిత్రీకరించారు. ఇన్ని విశేషాలకి తోడు ఈ సినిమా విడుదల కాకుండానే రికార్డులు క్రియేట్ చేస్తోంది. సోషల్ మీడియాలోకి అప్ లోడైన 24 గంటల్లోనే ఈ సినిమా ట్రైలర్ కు పది లక్షల వ్యూస్ వచ్చాయి. దీంతో మల్లూవుడ్ లో అత్యంత వేగంగా మిలియన్ వ్యూస్ తెచ్చుకున్న ట్రైలర్ గా పులిమురుగన్ రికార్డ్ క్రియేట్ చేసింది. సౌత్ ఇండియన్ మూవీ బాహుబలి దేశ విదేశాల్లో ఎంత క్రేజ్ తెచ్చుకుందో తెలిసిందే, మరి అంతే అంచనాలతో విడుదల కాబోతున్న పులిమురుగన్ ఏ రేంజ్ లో వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాకు నిర్మాత : తోమిచమ్ ములకుపాదమ్, దర్శకుడు : వైశాఖ, కథ : ఉదయకృష్ణ, సంగీతం : గోపీ సుందర్, కెమెరా : షాజీకుమార్.

 Trailers of Pulimurugan

https://www.youtube.com/watch?v=blQUlD8g4Pk
https://www.youtube.com/watch?v=_YcmenpZHX8
https://www.youtube.com/watch?v=OKhnYRq8xjw

To Top

Send this to a friend