మోహన్ లాల్ ఖాతాలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్

q
మళయాల చిత్ర సీమలోనే మునుపెన్నడు లేని రీతన అత్యంత భారీ వసూళ్లతో దూసుకుపోతుంది మోహన్ లాల్ తాజా చిత్రం పులిమురుగన్. మల్లూవుడ్ లో ఇప్పటివరకు క్రియేటైన రికార్డులు అన్నిటిని బ్రేక్ చేస్తూ విడుదలైన మూడు రోజుల్లోనే దాదాపు 15 కోట్లకి పైగా కలెక్షన్స్ తెచ్చుకుంది ఈ విజువల్ వండర్. ప్రపంచవ్యప్తంగా కూడా పులి మురుగన్ కి రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయి. మోహన్ లాల్ సినీ కెరీర్ లో ఈ రెంజ్ కలెక్షన్స్ రావడం ఇదే తొలిసారి, ఇక ఈ ఏడాది విడుదలైన మోహన్ లాల్ మరో సినిమా ‘ఒప్పమ్’ కూడా హిట్ టాక్ సొంతం చేసుకోవడం విశేషం. కేరళ సీమలో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోన్న పులిమురగన్ కు సంబంధించిన రైట్స్ కోసం అప్పుడే సౌత్ ఇండియాలో ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థలు పోటిపడుతున్నాయి. త్వరలోనే పులిమురుగన్ తెలుగు వెర్షన్ గురించిన వివరాలు రాబోతున్నాయి. ఈ సినిమాకు నిర్మాత : తోమిచమ్ ములకుపాదమ్, దర్శకుడు : వైశాఖ, కథ : ఉదయకృష్ణ, సంగీతం : గోపీ సుందర్, కెమెరా : షాజీకుమార్.

To Top

Send this to a friend