మోడీ వరాల వాన.. జనం తడవలేదు..

narendra-modi-demonetisation

పెద్దనోట్ల రద్దు ఓ సంచలన నిర్ణయం. దేశ భవితవ్యాన్నే మార్చేసే కీలక నిర్ణయం తీసుకున్న మోడీని మొదట్లో అందరూ అభినందించారు. అనక నగదు కష్టాలతో ఆడిపోసుకున్నారు. 50 రోజులు నాకోసం కష్టాన్ని భరించండి తర్వాత చూడండి భారత్ ను అంటూ మోడీ పిలుపునివ్వగానే అందరో ఎంతగానో ఊహించుకున్నారు.. ఖాతాల్లో పదివేల చొప్పున డబ్బులు వేస్తారని.. ఇంకా ఎన్నో పథకాలు ఫ్రీగా ఇస్తారని అనుకున్నారంతా.. కానీ నగదు కొరత పరిమితులు ముగిసిన తెల్లవారి శనివారం మోడీ విలేకరుల ముందుకు వచ్చి కొన్ని వరాలు కురిపించారు. ఆ వరాలకు జనాలు తడిసి ముద్దవ్వలేదు.. కేవలం చినుకులు చల్లిన చందంగా నే కనిపించింది.
పెద్దనోట్లు రద్దుతో ప్రధానంగా దెబ్బతిన్నది వేలకోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ రంగం, దేశంలోని వ్యాపారరంగం.. ఈ రెండు కూడా ఇప్పట్లో కోలుకునేలా లేవు. పెద్దనోట్ల రద్దుతో చిల్లర సమస్య వేధిస్తోంది. బ్యాంకులు, ఏటీఎంలలో ఇప్పటికీ క్యూలు తగ్గలేదు. విత్ డ్రా పరిమితిని 4500కే పెంచారు. ఏదైనా ఆస్పత్రి పాలైతే ఈ 4500 ఏ మూలకు సరిపోవు. ఇంతటి క్లిష్టపరిస్థితిని పరిమితులను సడలిస్తారని దేశ ప్రజలు పెట్టుకున్న ఆశలను మోడీ వమ్ముచేశాడని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఏవో కొన్ని కంటితుడుపు చర్యలు తీసుకొని ప్రజాసమస్యలను వదిలేసిన మోడీపై జనంలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది..

మొదట్నుంచి మోడీ ఉచిత హామీలకే వ్యతిరేకం. అందుకే జనాలపై వరాల వాన కురిపించలేదు. కేవలం కొన్ని వర్గాలకు రాయితీలు ప్రకటించారంతే.. గర్భిణులకు 6వేలు, రైతులకు రెండు నెలల వడ్డీ మాఫీ, సీనియర్ సిటిజన్స్ కు వడ్డీ పెంపు , గృహ నిర్మాణాలకు వడ్డీ తగ్గింపుర, చిరు వ్యాపారులకు పన్ను తగ్గింపు .. ఈ ముఖ్య రాయితీలు మినహా మోడీ ఏం ఆశించనంత ప్రయోజనాలు కల్పించలేదు. దీంతో దేశ జనం మోడీపై పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి.

To Top

Send this to a friend