మోడీ మా కాళ్లు విరగ్గొట్టేశారు..

 

‘రాష్ట్రంలో కొత్తగా 31 జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ రియల్ భూమ్ బ్రహ్మాండంగా ఉండి ఆదాయం ఊపందుకుంది. సరిగ్గా అలాంటి సమయంలోనే మోడీ 500, 1000 నోట్లు రద్దు చేశారు. కొత్త నోట్లు అందుబాటులో లేకుండా చేశారు. దీంతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. ఈ పరిణామం మా కాళ్లు విరగొట్టినట్టు అయ్యిందని’ కేసీఆర్ ప్రధాని మోడీతో అన్నారట.. ప్రధాని పెద్దనోట్లను రద్దు చేశాక కేసీఆర్ మోడీకి ఫోన్ చేసి మాట్లాడింది ఇదేనని అసెంబ్లీలో బుధవారం చెప్పారు..

కాగా దీనికి మోడీ అన్ని సర్దుకుంటాయని చెప్పారన్నారు. గుజరాత్ కంటే ఎక్కువ వృద్ధి రేటుతో మాంచి ఆదాయం సాధిస్తున్న తెలంగాణను అభినందించారని.. కొట్లాడి రాష్ట్రం సాధించుకున్న రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో నడుస్తోందని ప్రశంసించారన్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్ తెలంగాణ విద్యుత్ విషయంలో పూర్తిగా విజయం సాధించామని.. కోతల్లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా తెలగాణలోని పలు పథకాలు.. సాధించిన విజయాలను కేసీఆర్ ప్రస్తావించారు.

To Top

Send this to a friend