మోడీ ప్లాన్ లో కేసీఆర్ పడలేదు.. బాబు పడిపోయాడు!!

modi-kcr-and-naidu

దేశంలోని సమకాలనీ రాజకీయ వేత్తలో ఉద్దండులైన రాజకీయవేత్తలుగా ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ లు పేరుపొందారు.. ముఖ్యంగా రాజకీయాలు నడపడంలో.. చేతికి మట్టి అంటకుండా ప్రత్యర్థులను మూడు చెరువుల నీళ్లు తాగడంలో వీరు సిద్ధహస్తులు.. అందుకే మోడీ దేశాన్ని జయించాడు.. కేసీఆర్ తెలంగాణ ప్రదాత అయ్యాడు.. ఇక తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ ను తలదన్నే వ్యూహాలు రచించే మొనగాడు లేడంటే అతిశయోక్తికాదు.. మోడీ, కేసీఆర్ ల మధ్య మంచి అనుబంధం ఉంది.. అందుకే వీరు తమ చేతికి మట్టి అంటకుండా ఓ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబును భలే బుక్ చేశారు..
నోట్ల రద్దు నిర్ణయం దేశంలో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. మోడీ ప్రకటించినప్పుడు ఆ తర్వాత ప్రజల నుంచి ఇబ్బందులు ఎదురయ్యినప్పుడు స్వయంగా కేసీఆర్ ను ఢిల్లీకి పిలుపించుకొని కొన్ని సలహాలు సూచనలు స్వీకరించి అమలు చేశాడు. ఇందులో కేసీఆర్ రాజనీతజ్ఞత బాగా పనిచేసింది. నోట్ల రద్దు, డిజిటల్ లావాదేవీలు దేశంలో ఎలా చేయాలనే దానిపై ఆ తర్వాత మోడీ దేశంలోని సీఎంలతో కలిసి కమిటీ ఏర్పాటు చేశాడు. ముందుగా దీనికి బీజేపీయేతర సీఎంను అధ్యక్షుడిని చేయాలని మోడీ యోచించారట.. కేసీఆర్ ను ఉండమని అంటే ఆయన ససేమిరా అన్నారని సమాచారం.. ‘నోట్ల రద్దు విప్లవాత్మక చర్య.. ఇది పెద్ద హిట్ కావచ్చు.. అదే సమయంలో ప్రజా వ్యతిరేకతతో ప్లాప్ కావచ్చు.. దీని పర్యవసానాలు మోడీయే భరించాలి.. తేడా వస్తే ఆయనే అధికారం కోల్పోతారు.. అందులో మనం భాగస్వాములం అయితే మన సీటు పోతుంది.. అందుకే మోడీ కమిటీలో నేను ఉండలేదు..’ అని కేసీఆర్ సీనియర్ టీఆర్ఎస్ నేతలతో వ్యాఖ్యానించారట.. ఇలా నెపం తనపై పడకుండా కేసీఆర్ తప్పుకున్నాడు. ఇక హైటెక్ చంద్రబాబు మాత్రం ప్రచారం అంటే పడిచస్తాడని ఢిల్లీ పెద్దలకు ముఖ్యంగా మోడీకి తెలుసు .. అందుకే నోట్ల రద్దు కమిటీకి చంద్రబాబును సారథ్యం వహించమని అడగగానే మర్మం తెలియని బాబు సరేనన్నాడు. అందులో మధ్యప్రదేశ్, పాండిచ్చేరి సహా పలు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా కమిటీ ఏర్పాటైంది.. దీనర్థం మోడీ తాను తీసుకున్న నిర్ణయానికి తానొక్కడినే బలికాకుండా ఇలా చంద్రబాబు సహా పలు రాష్ట్రాల సీఎంలను కూర్చి ఈ చర్యలో వారిని భాగస్వాములను చేశాడు. దీంతో రద్దునోట్ల ప్రభావంపై వారు విమర్శించలేరు.. అదే సమయంలో ప్రజావ్యతిరేకతలో వారికి భాగస్వామ్యం దక్కుతుంది.. సో ఒకే దెబ్బకు చాలా పిట్లల్ని మోడీ పడగొట్టగా.. తెలివైన కేసీఆర్ ఆ ఉచ్చులో చిక్కుకోలేదు.. అదే సమయంలో బాబు ప్రచారం కోసం బొక్కబోర్లాపడ్డాడు..

To Top

Send this to a friend