మోడీ, పవన్ భవిష్యత్ ను చెప్పేసిన చిరు..

chiranjeevi-megastar

మెగాస్టార్ చిరంజీవి తన 150 వ సినిమా ప్రమోషన్ లో భాగంగా సోమవారం తెలుగు న్యూస్ చానల్స్ తో ఇంటర్వ్యూల్లో ముచ్చటించారు. సినిమా, రాజకీయ, విభేదాలు అన్ని పూసిగుచ్చినట్టు వివరించారు.. వర్మ-నాగబాబు కాంట్రావర్సీని తేటతెల్లం తేశారు. అన్నపై ప్రేమతో నాగబాబు ఉద్వేగానికి గురై తిట్టాడని.. వర్మ మరీ చీప్ గా ట్విట్టర్ లో అసభ్యంగా పోస్టులు పెడుతున్నాడని వివరించారు. వర్మ గురించి ఎంత తక్కువ పట్టించుకుంటే సమాజానికి అంత మంచిదని చిరు స్పష్టం చేశారు..

పవన్ చిరంజీవి ఆడియో ఫంక్షన్ కు రాకపోవడాన్ని కూడా చిరు పాజిటివ్ గానే స్పందించారు. పవన్ కళ్యాణ్ మనస్తత్వమే ఒంటరితనాన్ని కోరుకుంటుందని వివరించారు. పవన్ సినిమాల్లోకి రాకముందు కూడా మేమంతా సినిమా చర్చల్లో ఉంటే పవన్ ఒంటిరిగా రూంలో బుక్ చదువుకుంటూ ఉండేవారని చెప్పారు. అలాంటి మనస్తత్వం గల వ్యక్తి కాబట్టే పవన్ ను మేం అర్థం చేసుకున్నామన్నారు. పవన్ రాకపోయినా మేం పాజిటివ్ గానే తీసుకుంటామన్నారు.

ఇక పెద్దనోట్ల రద్దు.. సినిమా, జనంపై ప్రభావాన్ని అడిగినప్పుడు చిరంజీవి చాలా క్లారిటీగా సమాధానమిచ్చారు.. ‘‘మోడీ పెద్ద చెరువులోని ఒక శాతం ఉండే నాలుగు మొసళ్లు (నల్ల కుభేరులు)ను అంతమొందించడానికి మొత్తం చెరువునే ఎండగొట్టాడని.. దాని వల్ల చెరువులోని మొత్తం 99 శాతం చేపలు (ప్రజలు) చనిపోయారని..’’ పెద్దనోట్ల రద్దు ప్రభావాన్ని విశ్లేషించారు. యూపీఏ కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో గెలవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని.. ఎందుకంటే పెద్దనోట్ల రద్దు, మోడీ తీసుకున్న ప్రజా వ్యతిరేక చర్యల కారణంగానే కాంగ్రెస్ గెలుస్తుందని స్పష్టం చేశారు..

To Top

Send this to a friend