మోడీ పరువుతో ఆటలాడిన తెలుగు అధికారికి ఎదురుదెబ్బ

అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయవచ్చని మోడీ నిరూపించారు. ఏకంగా తనకు కంట్లో నలుసులా మారిన తెలుగు అధికారి అధికారాలకు కత్తెర వేశాడు. తెలుగువాడు, కేంద్ర సమాచార కమీషనర్ అయిన మాడభూషి శ్రీధర్ ప్రస్తుతం కేంద్రంలో ఉన్నత పదవిలో ఉన్నారు. స్వయం ప్రతిపత్తి గల సమాచార కమీషనర్ గా సేవలందిస్తున్నాడు. చాలా నిక్కచ్చి అధికారిగా పేరుతెచ్చుకున్నాడు. ఓ కేసు విషయంలో ఏకంగా ప్రధాని నరేంద్రమోడీతోనే ఢీకొన్నాడు.
నరేంద్రమోడీ డిగ్రీ వివరాలు ఇవ్వవలసిందిగా ఒక పౌరుడు ఢిల్లీ యూనివర్సిటీకి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నాడు. దానికి ఆ యూనివర్సిటీ నిరాకరించింది. దీంతో అతడు కేంద్ర సమాచార కమిషనర్ అయిన మాఢభూషి శ్రీధర్ కు దీనిపై దరఖాస్తు చేశాడు. దీంతో సామాన్యుడు అయినా.. ప్రధాని అయినా చట్టం ముందు అందరూ సమానులేనని.. ప్రధాని మోడీ డిగ్రీ వివరాలు సమాచార చట్టం కింద ఇవ్వాల్సిందేనని సదురు ఢిల్లీ యూనివర్సిటీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం ప్రధాని మోడీ దృష్టికి రావడంతో ఆయన ఆగమేఘాల మీద స్పందించారు. శ్రీధర్ పదవి, అధికారానికి కత్తెర వేయించాడు..
ప్రధాన సమాచార కమిషనర్.. మాఢభూషి శ్రీధర్ కు విద్యాశాఖ కు సంబంధించిన కేసులు ఏవీ ఇవ్వకూడదని నిర్ణయించి తొలగించారు. ఈ నిర్ణయంతో మాఢభూషి సదురు ఢిల్లీ యూనివర్సిటీ, ప్రధాని ఢిగ్రీ ఫలితాలు తదితర విద్యా సమాచారంపై ఆదేశాలు ఇవ్వడం కుదరదన్నమాట.. ఇలా నరేంద్రమోడీ శ్రీధర్ కు కత్తెర వేయించి ప్రస్తుతానికి తన డిగ్రీ బాగోతం బయటపడకుండా తప్పించుకున్నాడన్నమాట..

To Top

Send this to a friend