మోడీ తల్లిపై కేజ్రీవాల్ సంచలన కామెంట్లు వివాదాస్పదం.

kejwiral-vs-modi-tweet-apnewsonlinein

ప్రధాని నరేంద్రమోడీ తాను ఏదీ చేసినా ట్విట్టర్ గూట్లో ప్రజలతో పంచుకోవడం అలవాటు… పొద్దున యోగా చేసినా కొత్త వ్యక్తుల్ని కలిసినా.. ఏదైనా విశేషమైనా ఇలా దేనిపైనైనా ట్విట్టర్ లో పంచుకుంటారు. అలాగే ఈరోజు ఉదయం కూడా పంచుకున్నారు.. ‘‘తాను ఇవాళా యోగా చేయడం లేదని.. అమ్మను కలవడానికి వెళుతున్నానని.. అక్కడే ఆమెతో బ్రేక్ ఫాస్ట్ చేస్తానని.. ఆమెతో సమయం గడుపుతానని ’’ ప్రధాని ట్వీట్ చేశారు.. ఈ ట్వీట్ పై నేషనల్ చానాళ్లు, సైట్లు ఉదయం నుంచి తెగ ప్రచారం చేశాయి.

ఈ ప్రధాని ట్వీట్ అందరికీ సంతోషాన్నిచ్చినా ఢిల్లీ సీఎంకు మాత్రం కడుపు మండింది.. మోడీ ట్వీట్ కు కౌంటర్ గట్టిగా ఇచ్చాడు.. దీంతో రాజకీయంగా దుమారం రేగింది.. మోడీ తన తల్లిని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నాడని కేజ్రీ విమర్శించారు.. కేజ్రీవాల్ మోడీకి కౌంటర్ గా ఇచ్చిన ట్వీట్ లో ‘‘మోడీ తన తల్లిని 3 నెలలకోసారి కలస్తాడని..కానీ తన తల్లిని నేను రోజు ఇంట్లోనే ఉంచి చూసుకుంటాను.. హిందూ సంప్రదాయాల ప్రకారం తల్లిని, భార్యను తమతో పాటే ఉంచుకోవాలని..కానీ మోడీకి ఢిల్లీలో లంకంత కొంప ఉన్నా తనతోనే ఉంచుకోవట్లేదు.. ఆయన ఇళ్లు పెద్దది కానీ మనసు అంత పెద్దది కాదని అనిపిస్తోంది..’’ అని మండిపడ్డారు.. దీంతో ఈ వివాదం రెండు రాజకీయ పార్టీల్లో దుమారానికి కారణమైంది. పరస్పరం విమర్శలకు పుసిగొల్పింది.. రాజకీయాలకు కూడా తల్లులను వాడుకునే స్థితికి ఈ నాయకులు దిగజారారని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు..

To Top

Send this to a friend