మోడీ టార్గెట్ కంప్లీట్.. కష్టాలు రిపీట్.. ఈరోజే కీలకం..

demonetisation

ప్రధాని నరేంద్రమోడీ పెద్దనోట్లు రద్దు చేసి పెట్టిన డిసెంబర్ 30 టార్గెట్ శుక్రవారంతో ముగిసింది.. చివరి రోజు వరకు జనం ఏటీఎంలు, బ్యాంకుల వద్ద అలానే క్యూల్లో నిలబడ్డారు. ఇక పెద్ద నోట్లు డిపాజిట్ చేయడానికి వీలు లేకపోవడంతో జనం శుక్రవారం బ్యాంకుల్లో ఎగబడ్డారు. ఇక ప్రధాని మోడీ శుక్రవారం రాత్రి ఓ కార్యక్రమంలో నోరు విప్పారు. అక్రమార్కుల నల్ల డబ్బు అంతా పేదలదేనని తేల్చిచెప్పారు. శనివారం మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో నోట్లరద్దు .. వచ్చిన డబ్బు గురించి దేశ ప్రజలపై ఎలాంటి వరాలు కురిపాస్తాడనే ఆశ అందరిలోనూ నెలకొంది. జన్ ధన్ ఖాతాల్లో 10 వేలు జమ చేస్తారని కొందరు.. లేక గృహ నిర్మాణ పథకాలు ప్రకటిస్తారని.. ఉద్యోగాలకు ఆదాయపరిమితి పెంపు, రైతు రుణమాఫీ సహా చాలా వరాలు ప్రకటిస్తారనే ఆశలున్నాయి. ఈరోజు రాత్రితో అవన్నీ మోడీ నోట వెంట రానున్నాయి.

ఇక పెద్దనోట్ల డిపాజిట్ గడువు ముగియడంతో ఆర్ బీఐ దేశ ప్రజలను కనికరించి.. రేపటినుంచి ఏటీఎంలలో నగదు విత్ డ్రా పరిమితిని 4500కు పెంచింది.. ఇప్పటికైనా అపరిమిత బ్యాంకు లావాదేవీలకు ఆర్ బీ.ఐ పరిమితి ఇస్తుందా లేదా అన్నది తేలాల్సింది. మొత్తంగా మోడీ వేసిన పాచికను ప్రజలు భరించారు. ఇప్పుడు చేయాల్సింది మోడీ చేతిలో ఉంది. చేయకపోతే చరిత్రహీనుడవుతాడు.. చేస్తే దేశచరిత్రలో సువర్ణధ్యాయాలతో లిఖించదగ్గ ప్రధాని అవుతాడు..

To Top

Send this to a friend