మోడీ గొప్ప.. కేసీఆర్ దిబ్బ.

*కేసీఆర్ మొక్కుల ఫలితం ప్రజలపై భారం*
– *ఓ జాతీయ మీడియా చానల్*

3000 కోట్లతో మోడీ పటేల్ విగ్రహం పెడుతున్నా జాతీయ మీడియా మాట్లాడదు.

3600 కోట్లతో శివాజీ విగ్రహం పెడతానన్నప్పుడు మీడియా నోరు మెదపదు.

కాని 5 కోట్లతో రెండు రాష్ట్రాలలో మెజారిటీ ప్రజలు నమ్మే దేవుడికి ఆభరణాలు చేయిస్తే మాత్రం జాతీయ మీడియా గగ్గోలు పెడుతుంది.

శివాజీ, పటేల్‌లు ధర్మ రక్షణకు, ఈ దేశ సమగ్రతకు కడవరకు శ్రమించిన యోధులు. వారి విగ్రహాలకు 6600 కోట్లు మనకు గర్వకారణం అనుకుంటే మరి దేశంలో ఎక్కువ భక్తులొచ్చే గుడికి, తెలంగాణలో ప్రతి ఇంట్లో ఫోటోగా వెలసిన గోవిందునికి 5 కోట్లు ఎక్కువేనా.

నిజమే దేవుడి భూములు కబ్జాలు చేసే నాయకులే మన మీడియాకు తెల్సు. ఆలయ నిధులను దారి మళ్లించే ప్రభుత్వాల గురించే మీడియా విన్నది. అలా ఉండాలి ఎవరైనా. దేవుడి సొమ్ము తినాలి కాని దేవుడికి నగలు చేయించడమేమిటి. అధికారంలో ఉన్న వారు ప్రభుత్వ సొమ్ము మెక్కినా మీడియా పెద్ద మనసుతో అర్థం చేసుకుంటుంది కానీ ఇదేమిటీ. ప్రజలకు అభ్యంతరం లేకపోయినా సరే మీడియా దీన్నిపుడు అర్జెంటుగా అడ్డుకోవాలి. అడ్డుకొని తీరాలి. మరి చేసింది డిల్లీ పెద్దలు కాదు కదా. ఆఫ్ట్రాల్ ఒక సౌత్ ఇండియా సీయెం. విగ్రహాలకు గుజరాత్‌లో 3000 కోట్లు, మహరాష్ట్రలో మరో 3600 కోట్లంటే ఓకే కాని ఈ 5 కోట్లంటే మాటలా.?

తెలంగాణ ఆకాంక్షతో మా తెలంగాణ జాతి మొత్తం దహించుక పోతున్నప్పుడు ఈ జాతి మీడియా పాత్ర ఏంటి ? అరవైఏండ్ల ఆకాంక్ష కోసం మా యువత ఉద్యమించిప్పుడు ఈ జాతీయ మీడియా ఏడ పడుకుంది.?
సమైక్య పాలకుల అణచివేతకు నిరసనగా మా యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నప్పుడు ఈ మీడియా ఎందుకు ప్రశ్నించలేదు ?

రెండేళ్ల తెలంగాణ ప్రభుత్వ విజయాలను పట్టించుకోకుండా ఉండడం వెనక ఈ మీడియా దుర్బుద్ధి ఏంటి ? చంద్రబాబు వైఫల్యాలను పట్టించుకోకుండా .. కేసీఆర్ మీద దుష్ప్రచారం చేయడంలో మీడియా పక్షపాత వైఖరి స్పష్టమవ్వట్లేదా.

నిస్సిగ్గుగా నిర్లజ్జగా తప్పుడు వార్తలు రాస్తున్న జాతీయ మీడియా వైఖరిని సోషల్ మీడియాలో ఇలా ఎండగడతున్నారు..

To Top

Send this to a friend