మోడీ ఎంటర్ అయ్యాడు.. ఇక అంతే..

sasikala-pannerselvam-tn

దేశాన్ని కాషాయ మయంగా మార్చాలనుకుంటున్న మోడీకి జయలలిత మరణం అందివచ్చిన అవకాశంగా మారింది. అందుకే అధికార దర్పాన్ని అడ్డంపెట్టుకొని తమిళనాట బీజేపీ ప్రవేశానికి వేగంగా పావులు కదుపుతున్నారు. ఇందుకోసం జయలలిత మరణంతో ఖాళీ అయిన సీఎం సీటు చుట్టే రాజకీయం నడుస్తోంది. ప్రస్తుత సీఎం , జయలలిత అనుంగ శిష్యుడు పన్నీర్ సెల్వం సీఎంగా కొనసాగుతున్నారు. మరో వైపు జయలలిత ప్రియసఖి శశికళ కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల బలంతో పన్నీర్ సెల్వంను దించేసి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. ఈ పరిణామాలు బీజేపీకి కలిసివచ్చాయి.
శశికళను సీఎంను చేయకుండా ప్రస్తుత సీఎం పన్నీర్ సెల్వం ఢిల్లీ కి వెళ్లి మోడీ సాయం కోరారు. దీంతో ఇదే అవకాశంగా మోడీ రెచ్చిపోతున్నారు. జయలలిత ఆసుపత్రిలో ఉండగా రాష్ట్రాన్ని తన కనుసన్నల్లో పాలించిన ప్రస్తుత ప్రధాన కార్యదర్శి రామ్మెహన్ రావుపై ఐటీదాడులు చేయించారు. దీంతో శశికళ బ్యాచ్ పై పిడుగుపడ్డట్టు అయ్యింది. అధికారాన్ని కైవసం చేసుకుంటే రాష్ట్రంలో అస్థిరతతో పేరుతో రాష్ట్రపతి పాలన మోడీ విధించే అవకాశం ఉంది. దీంతో శశికళ సైలెంట్ అయిపోయింది. ప్రస్తుతానికి పన్నీర్ సెల్వం సీఎంగా కొనసాగితే రాజ్యసభలో అన్నాడీఎంకే మద్దతుతో జీఎస్టీ ఆమోదించుకోవచ్చనే ఆలోచనతో బీజేపీ ఉంది. అందుకే తమిళనాడులో ఐటీ దాడులతో బెంబేలిత్తేస్తోంది. మోడీ రంగప్రవేశంతో పరిణామాలు ప్రస్తుతం తమిళనాట అస్తిరతకు కారణమై సంక్షోభం దిశగా కదులుతోంది..

To Top

Send this to a friend