మోడీని రామోజీ తెగ మోసేది ఇందుకోసమేనా..?

ramoji_modi-apnewsonlinein

నరేంద్రమోడీ పాలనపై దేశ ప్రజల్లో సంతృప్తి ఉందా..? లేదా.? పెద్దనోట్ల రద్దు తర్వాత ఆయనపై జనాభిప్రాయం మారిందా ఆయన స్థాయికి తగ్గరీతిలో పాలన కొనసాగించడం లేదా … ఈ పశ్నలన్ని సగటు భారతీయులు రోజు చర్చిస్తూనే ఉంటున్నారు.. టీవీల్లో జోరుగా చర్చించుకుంటున్నారు. ఎన్నికలకు ముందు అది చేస్తా.. ఇది చేస్తానన్న మోడీ ఎన్నికలయ్యాక విదేశీ టూర్లంటూ తిరుగుతూ కాలహరణం చేస్తున్నారు. నల్లధనం తెస్తానన్నాడు మడతేశాడు.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తా అంటూ తిరుపతి వెంకన్న సాక్షిగా ఒట్టెసీ అటకెక్కించాడు. అచ్చేదిన్ తెస్తా నని రైతులకు మాట ఇచ్చి కార్పొరేట్లకు మేలు చేస్తున్నాడు. మోడీ ఈ రెండేళ్లలో సాధించిన విజయాల కన్నా.. ఆయన పాలన మార్క్ లేక జనాగ్రహమే ఎక్కువగా పెల్లుబుకింది. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల ఆగ్రహావేశాలకు గురిఅయ్యాడు..
కానీ ఎవరికీ నచ్చినా నచ్చకున్నా.. ఆయన పాలన మాత్రం ఒక్కరికి తెగ నచ్చేసింది. అందుకే మోడీ రెండున్నరేళ్ల పాలనపై ఆయన తెగ మోసేస్తున్నాడు. ఈనాడు సంస్థల అధిపతి రామోజీ ఆయన పత్రికలో మోడీని తెగ ఆకాశానికెత్తేస్తున్నాడు. ఎన్ని పత్రికలు విమర్శించినా మోడీ లోపాలను ఎత్తిచూపినా ఆయనకు మోడీ శ్రీరామచక్రవర్తిలా కనిపిస్తున్నారు. కాంగ్రెస్ బద్ద వ్యతిరేకి రామోజీ సహజంగానే బీజేపీకి దగ్గర.. అనడంలో సందేహం లేదు. మరీ ఇంతలా మోయడంలో ఏంటి కారణమనే సందేహం అందరిలోనూ ఉంది..
మోడీ దేశ అత్యున్నత రెండో పౌరపుస్కారం పద్మ విభూషన్ ను రామోజీకి కట్టబెట్టాక మోడీ-రామోజీ ద్వయంలో ప్రేమ ఎక్కువైంది. అందుకే మోడీ పాలనపై ఈనాడు మెయిన్ లో తెగ రాయించేస్తున్నారు రామోజీ.. జనాలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే ఒక్క పథకాన్ని ఇప్పటివరకు ప్రకటించని మోడీపై రామోజీ ప్రేమ చూసి అందరూ ముక్కనవేలేసుకుంటున్నారు. అవార్డు ఇచ్చినందుకా ఈ ప్రేమ అంటూ మండిపడుతున్నారు.
పాపం మోడీ కంటే తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబులు ఎక్కువే చేశారు. పింఛన్లు 1500 , రేషన్ తదితర ఎన్నో పథకాలతో సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. వీళ్ల పాలనను కాదని.. ఇవేవీ చేయని మోడీని మోస్తున్నరామోజీ రాతలు వెగటుపుట్టిస్తున్నాయంటున్నారు తెలుగు జనాలు..

To Top

Send this to a friend