“మేము” జులై 8న వస్తోంది !!

సూపర్ స్టార్ సూర్య-అమలాపాల్-బిందుమాధవి ముఖ్య తారాగణంగా..  పాండిరాజ్ దర్శకత్వంలో.. సాయి మణికంఠ క్రియేషన్స్ పతాకంపై జూలకంటి మధుసూదన్ రెడ్డి నిర్మిస్తున్న “మేము” చిత్రం జూలై 8న  ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆంధ్ర, తెలంగాణల్లో అత్యధిక ధియేటర్స్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.   
నిర్మాత  జూలకంటి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ…  “జులై 1న విడుథల కావాల్సి ఉన్న “మేము” చిత్రాన్ని కొన్ని అనివార్య కారణాలవల్ల జులై 8న విడుదల చేస్తున్నాం. ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలతో తప్పక చూడాల్సిన చిత్రమిది.  తమిళంలో ఈ చిత్రాన్ని నిర్మించిన సూపర్ స్టార్ సూర్య తెలుగులో సమర్పిస్తున్నారు. దాన్ని బట్టి ఈ చిత్రం ఆయన మనసుకు ఎంత దగ్గరో అర్ధమవుతుంది” అన్నారు.
To Top

Send this to a friend