మెగాస్టార్ 151వ సినిమా డైరెక్టర్ గా సురేందర్ రెడ్డి

ధ్రవ సినిమా.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు హిట్ నిచ్చింది. ఆ సినిమా డైరెక్షన్ విషయంలో నూటికి నూరు మార్కులు పడ్డాయి దర్శకుడు సురేందర్ రెడ్డికి..ఆయన గతంలో తీసిన కిక్, రేసుగుర్రం లాంటి చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. మంచి కథ దొరికితే సురేందర్ రెడ్డి దుమ్ముదులుపుతాడనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. మంచి కథకుడు కాకపోయినా.. డైరెక్షన్ లో మాత్రం కింగ్ మేకర్ సురేందర్ రెడ్డి అనే పేరుంది.. అందుకే చిరు తన 150 వ సినిమాను పూర్తి చేసుకున్నాక తన నెక్ట్స్ ప్రాజెక్ట్ సినిమా డైరెక్టర్ గా సురేందర్ రెడ్డినే ఎంచుకున్నారు..

హీరోయిన్ వేట మొదలు..

చిరంజీవి 151వ సినిమా ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. మెగా క్యాంప్ అప్పుడే కథల వేట మొదలు పెట్టిందట.. మంచి కథ కోసం ఇప్పటికే రచయితల ను సంప్రదిస్తోందట.. అంతేకాకుండా హీరోయిన్ విషయంలో కూడా ఈసారి పక్కాగా ముందుకెళ్తున్నారు. తొలుత 150వ చిత్రం ఖైదీ కోసం అనుష్కను అనుకున్న చిరంజీవి.. ఆమె డేట్స్ ఖాళీగా లేక చివర్లో కాజల్ ను హీరోయిన్ గా ఎంచుకున్నారు. ఈ సారి అలాంటివి జరగకుండా అనుష్కనే ఎంచుకోవాలని నిర్ణయించారట.. చిరు పక్కన అనుష్క అయితే సూట్ అవుతుందని.. అందుకే ఆమెను సంప్రదిస్తున్నట్టు సమాచారం. సో త్వరలోనే చిరంజీవి 151 వ సినిమా విశేషాలు బహిరంగంగా వెల్లడికానున్నాయన్న మాట..

To Top

Send this to a friend