ఏంకర్ శ్రీముఖి, ఇటీవల ఆమె జోరు టాప్ గేర్ లో వుంది. అందమే కాదు, కవళికలు..కవ్వింతలు కూడా ఓ రేంజ్ లో వుంటున్నాయి. ఏం చేసినా కూడా కుర్రకారు గుండెల్ని గాలమేసి లాగేసి, గింగిరాలు తిప్పేస్తున్నాయ్. బుంగమూతి పెట్టినా, కన్నుకొట్టినా, ఒకటేమిటి ఏం చేసినా యూత్ చిత్తరబిత్తరైపోతున్నారు శ్రీముఖి టాలెంట్ కు.
సోషల్ నెట్ వర్క్ లో తెగ హడావుడి జరిగిపోతున్న మెగాస్టార్ అమ్మడు కుమ్ముడు పాటకు జస్ట్ తన ఫేస్ ఫీలింగ్స్ ఇచ్చి ఓ విడియో చేసి ట్విట్టర్ సాక్షిగా చూపించేసింది ఏంకర్ శ్రీముఖి. ఇంకేముంది వందలాది రీట్వీట్ లు, వందలాది లైక్ లు టప టపా పిట్టలు రాలినట్లు రాలిపోయాయి.
ఇక కామెంట్లకంటారా లెక్కే లేదు. ఈ విడియో చూసి పడిచచ్చిపోయినా చాలంటూ..అబ్బో కవిత్వాలే కవిత్వాలు. మొత్తానికి శ్రీముఖి ఫాలోయింగ్ ఓ రేంజ్ లో వుంది. కానీ ఎటొచ్చీమాస్ ఇమేజ్ తో పాటు సుమ మాదరిగా కాస్త క్లాస్ ఇమేజ్ కూడా తెచ్చుకుంటే, భారీ సినిమా ఫంక్షన్లు కూడా దున్నేయడం గ్యారంటీ.
