మూడేళ్ల గ్యాప్, ఫ్యామిలీ ప్యాక్ :

ఒకటి కాదు.. రెండు కాదు.. అక్షరాల మూడేళ్ల యజ్ఞంలో బాహుబలి కోసం కష్టపడ్డ ప్రభాస్ ఎట్టకేలకు అందులోంచి బయటపడ్డాడు. లవర్ బాయ్, మాస్ , క్లాస్ సినిమాలు తీసి అదరహో అనిపించుకున్న ప్రభాస్ .. బాహుబలి కోసం పోరాటయోధుడిగా నటించి దేశ, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
బాహుబలి లాంటి కళాఖండం కోసం దాదాపు మూడేళ్ల పాటు కాల్షీట్లు ఎవ్వరికీ ఇవ్వకుండా పనిచేశారు ప్రభాస్.. ఇప్పుడు బాహుబలి షూటింగ్ మొత్తం అయిపోయి.. సినిమా విడుదలకు రంగం సిద్ధం అవుతోంది. దీంతో ప్రభాస్ తన కొత్త చిత్రాన్ని సోమవారం లాంఛ్ చేశారు.
సోమవారం ప్రభాస్ కొత్త చిత్రం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.. బాహుబలి విడుదల అయ్యాక సినిమా లాంచ్ అవుతుందని ప్రచారం జరిగినా నిన్ననే కొత్త చిత్రం ను స్టార్ట్ చేశారు. ఈ లవ్ , యాక్షన్ స్టోరీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారట.. రన్ రాజా రన్ ఫేం.. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. సుజీత్ కూడా ప్రభాస్ కు దూరబంధువే కావడం గమనార్హం. ప్రభాస్ కజిన్ బ్రదర్స్ వంశీ, ప్రమోద్ లే నిర్మాతలు వ్యవహరిస్తున్నారు.
తెలుగు తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కతున్న ఈ మూవీ పూర్తిస్థాయి లవ్ స్టోరీనట. దీనికి శంకర్ ఇషాన్ సంగీతం అందిస్తున్నారు. మాధీ ఫొటో గ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు పాల్గొని క్లాప్ కొట్టారు. దిల్ రాజు చిత్ర బృందం పాల్గొంది.
కాగా ఈ సినిమా పూర్తిస్థాయి ప్రభాస్ ఫ్యామిలీ సినిమాగా చెప్పవచ్చు. సుజీత్, నిర్మాతలు అంతా ప్రభాస్ బంధువులే… ఓ రకంగా బాహుబలితో భారీ పారితోషకం అందుకున్న ప్రభాస్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో ఉన్నట్టే కనిపిస్తోంది. బాహుబలి తర్వాత వస్తున్న చిత్రం కావడంతో అంచనాలుంటాయని.. ఫ్యామిలీ ప్యాక్ సినిమాగా తెస్తున్నారు.

To Top

Send this to a friend