మూడు పాట‌లు మిన‌హా షూటింగ్ పూర్తి చేసుకున్న సుప్రీమ్ హీరో సాయి ధ‌రమ్ తేజ్ ‘తిక్క‌’

వ‌రుస విజ‌యాలు సాధిస్తూ సుప్రీమ్ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రంతో హ్యాట్రిక్ స‌క్స‌ెస్ ని అందుకున్న సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్‌ తేజ్, ల‌రిస్సా బోన్సి, మ‌న్నార చోప్రా జంట‌గా, సునీల్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో, డాక్ట‌ర్. సి.రోహిన్ రెడ్డి నిర్మాత‌గా శ్రీ వెంకటేశ్వ‌ర మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ గా రూపోందిస్తున్న చిత్రం ‘తిక్క‌’. ఈ చిత్రాన్ని నిర్మాత డాక్ట‌ర్‌.సి.రోహిన్ రెడ్డి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే దాదాపు టాకీ పూర్తిచేసుకున్న ‘తిక్క’ చిత్రం మూడు సాంగ్స్ షూటింగ్ మాత్ర‌మే బ్యాల‌ెన్స్ వుంది. జూన్ లో ఈ పాట‌ల చిత్రీక‌ర‌ణ కూడా కంప్లీట్ చేస్తారు. ఇప్ప‌టికే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్ సంగీత సారథ్యంలో చివ‌రి పాట‌ని చెన్నైస్టూడియోలో రికార్డు చేశారు. థ‌మ‌న్ అందించిన సూప‌ర్బ్‌ ఆడియో ని జులై మెద‌టి వారంలో గ్రాండ్ గా విడుద‌ల చేయ‌నున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి ప్ర‌పంచ‌వ్యాప్తంగా చిత్రాన్ని జులై మూడ‌వ వారంలో విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత డాక్ట‌ర్‌.సి.రోహిన్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీ వెంక‌టేశ్వ‌ర మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మిస్తున్న చిత్రం ‘తిక్క‌’. సునీల్ రెడ్డి ద‌ర్శ‌కుడు. ల‌రిస్సా బోన్సి, మ‌న్నార చోప్రాలు హీరోయిన్స్ గా చేస్తున్నారు. జూన్ లో చిత్రీక‌రించే మూడు సాంగ్స్ తో టోట‌ల్ షూటింగ్ పూర్త‌వుతుంది. చెన్నైలో మ్యూజిక్ డైర‌క్ట‌ర్ థ‌మ‌న్ స్టూడియోలో చివ‌రి సాంగ్ రికార్డింగ్ చేశాము. థ‌మ‌న్ అందించిన ఆడియో అటు మెగా అభిమానుల‌కే కాకుండా సామ‌న్య సినీ ల‌వ‌ర్స్ కూడా విప‌రీతంగా న‌చ్చుతుంది. సాంగ్స్ అన్నీ ఫుల్ ఎన‌ర్జిటిక్ గా వుంటాయి . మా హీరో సాయి ధ‌ర‌మ్‌ తేజ్ ఎనర్జీ కి స‌ర‌పోయో ఆడియో థ‌మ‌న్ అందించాడు. ఈ ఆడియోని మెగా అభిమానుల స‌మ‌క్షంలో జులై మెద‌టి వారంలో విడుద‌ల చేయ‌నున్నాము. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి జులై మూడ‌వ వారంలో చిత్రాన్ని విడుదల చేయ‌టానికి సన్నాహ‌లు చేస్తున్నాము. ఇప్పటికే పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ద‌ర్శ‌కుడు సునీల్ రెడ్డి చాలా కొత్త‌గా, అందంగా చిత్రీక‌రించ‌టమే కాకుండా కామెడి అద్బుతంగా పండించాడు. ఆలీ, ర‌ఘుబాబు, పోసాని, ప్ర‌భాస్ శీను, స‌ప్త‌గిరి, వెన్నెల కిషోర్ ఇలా ఇండ‌స్ట్రిలో వున్న టాప్ కమెడియ‌న్స్ అంద‌రూ ఈ చిత్రంలో న‌వ్వులు కురిపించారు. మా హీరోయిన్స్‌ ఇద్ద‌రూ కూడా చాలా బాగా న‌టించారు. వారిని సినిమాటోగ్ర‌ఫ‌ర్ కె.వి.గుహ‌న్ గారు చాలా అందంగా క్యూట్ గా చూపించారు. సాయి ధ‌ర‌మ్ తేజ్ ఇప్ప‌టి వ‌ర‌కూ చేసిన చిత్రాలతో పోల్చితే విభిన్న‌మైన క‌థాంశంతో వుంటుంది మా ‘తిక్క’ చిత్రం. మా చిత్రం యోక్క ఫ‌స్ట్ లుక్ ని నెక్ట్స్ వీక్ లో విడుద‌ల చేసి, అతి త్వ‌ర‌లో టీజ‌ర్ ని విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నాము. శ్రీ వెంక‌టేశ్వ‌ర మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో వ‌చ్చే చిత్రం ప‌బ్లిసిటి విష‌యంలో కూడా ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా మా చిత్రాన్ని ప్ర‌తి సినిమా ల‌వ‌ర్ ద‌గ్గ‌ర‌కి తీసుకెళ్ళే విధంగా వినూత్నంగా ప్లాన్ చేస్తున్నాము. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునేలా మా ‘తిక్క‌’ చిత్రం వుంటుంద‌ని ఆశిస్తున్నాము. అని అన్నారు.

న‌టీన‌టులు..
సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌, ల‌రిస్సా బోన్సి, మ‌న్నార చోప్రా, ముమైత్ ఖాన్, ఫరా కరిమీ, రాజేంద్ర ప్ర‌సాద్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ఆలి, సప్త‌గిరి, తాగుబోతు ర‌మేష్‌, వెన్నెల కిషోర్‌, అజ‌య్‌, ర‌ఘుబాబు, ప్ర‌భాస్ శ్రీను, స‌త్య‌, ఆనంద్‌, వి.జే.భాని, కామ్నా సింగ్‌ న‌టించ‌గా..

టెక్నీషియ‌న్స్‌..
సంగీతం- ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌
ఎడిట‌ర్‌- కార్తీక్ శ్రీనివాస్‌
ఆర్ట్‌- కిర‌ణ్ కుమార్‌
క‌థ‌- షేక్ దావూద్‌
మాట‌లు- ల‌క్ష్మీ భూపాల్ అండ్ హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌
డాన్స్‌- ప్రేమ్ ర‌క్షిత్‌
యాక్ష‌న్‌- విలియ‌మ్ ఓ.ఎన్‌.జి, రామ్‌-లక్ష్మ‌ణ్‌, ర‌వివ‌ర్మ‌, జ‌ష్వా
కెమెరా- కె.వి.గుహ‌న్‌
స‌హ‌నిర్మాత‌-కిర‌ణ్ రంగినేని

నిర్మాత‌- డాక్ట‌ర్‌.సి.రోహిన్ రెడ్డి
ద‌ర్శ‌కత్వం- సునీల్ రెడ్డి

To Top

Send this to a friend