మీ ఎస్.బీ.హెచ్ అకౌంట్ ఇక ఉండదు..

దేశంలోనే లీడ్ బ్యాంకు అయిన ప్రభుత్వ రంగంలోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్.బీ.ఐ) అంతర్జాతీయ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటిగా మారబోతోంది. దేశంలోని సగం జనాభా అకౌంట్లన్నీ ఈ బ్యాంకులోనే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. మీకు ఎస్.బీ.హెచ్ అకౌంట్ ఉంటే ఇక ఏప్రిల్ 1 నుంచి రద్దు అవుతోంది. ఎందుకంటే మీరు ఎస్.బీ.ఐ బ్యాంకులో ఖాతాదారుడిగా మారిపోతారు.. ఎస్.బీహెచ్ ఏప్రిల్ 1
నుంచి ఎస్.బీ.ఐలో విలీనం కాబోతోంది. దీంతో పాటు స్టేట్ బ్యాంకు ఆఫ్ మైసూర్, పాటియాలా, జైపూర్ బికినీర్, ట్రావెన్ కోర్ బ్యాంకులు కూడా ఎస్ బీఐలో విలీనం అవుతున్నాయి. ఈ బ్యాంకులన్నీ ఏప్రిల్ 1 నుంచి పనిచేయవు.. ఆ బ్యాంకులు ఎస్ బీఐ గా మార్పు చెందుతాయి. ఎస్. బీహెచ్ ఖాతాదారులు కూడా ఇక ఎస్ బీఐ ఖాతాదారులుగా మారి అంతర్జాతీయ బ్యాంకింగ్ సేవలు.. అతి సాంకేతిక ఎస్ బీఐ సేవలు పొందుతారు.

ఈ అయిదు ఎస్.బీఐ బ్యాంకుల విలీనంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుగా మారుతోంది. దాదాపు 37లక్షల కోట్ల తో దిగ్గజ సంస్థగా ఎస్.బీ.ఐ మారుతుంది. మొత్తం 22500 శాఖలు, 58000 ఏటీఎంలు ఎస్ బీఐకి ఉంటాయి. ఇంత పెద్ద బ్యాంకు ప్రపంచంలో ఎక్కడా ఉండదు.. ప్రపంచంలో ఎక్కడున్నా ఎస్బీఐతో మనం లావాదేవీలు చేసుకునేలా ప్రపంచ బ్యాంకుగా మారుతోంది.

ఇది వరకు దేశంలోనే అతిపెద్ద బ్యాంకు కొనుగోలును కోటక్ మహేంద్ర
నిర్వహించింది. ఐఎన్జీ వైశ్య బ్యాంకును దాదాపు 15000కోట్లు చెల్లించి
కోటక్ 2015లో కొనుగోలు చేసింది. ఇదే దేశంలో అతిపెద్ద కొనుగోలు.. ఇప్పుడు ఎస్ బీఐ విలీనంతో దాన్ని తోసిరాజని ఎస్.బీ.ఐ విలీనం దేశంలోనే పెద్ద కొనుగోలుగా అవతరించింది.

To Top

Send this to a friend