`మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు` అవుటండ్ అవుట్ ఎంట‌ర్ టైన‌ర్ – స‌లోని

saloni01

పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు`. ఈ చిత్రం డిసెంబ‌ర్ 16న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ స‌లోని బుధ‌వారం సినిమా గురించిన సంగ‌తుల‌ను పాత్రికేయుల‌తో ముచ్చ‌టించారు.
– మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు ల‌వ్‌, రొమాంటిక్ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్‌. ఒక ఐడియా న‌లుగురు ప్రేమికుల జీవితాన్ని ఎలా మార్చింద‌నేదే కాన్సెప్ట్‌. హండ్రెడ్ ప‌ర్సెంట్ అవుటండ్ అవుట్ ఎంట‌ర్‌టైన‌ర్‌.
– ఈ చిత్రంలో పృథ్వీకి జోడిగా న‌టించాను. పృథ్వీ మ‌హేష్ క్యారెక్ట‌ర్‌లో న‌టించారు. నేను స‌మంత క్యారెక్ట‌ర్‌లో న‌టించాను. ఇంట‌ర్మీడియ‌ట్ స్టూడెంట్స్‌గా ఇద్ద‌రి న‌ట‌న అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. న‌న్ను అంద‌రూ ర్యాగింగ్ చేస్తుంటారు. పృథ్వీ సేవ్ చేస్తుంటాడు. న‌న్ను ఫాలో అవుతూ స్ట‌డీ చేస్తుంటాడు. అలా మా ఇద్ద‌రి మ‌ధ్య ల‌వ్ స్టార్ట్ అవుతుంది. కాలేజ్ యాన్యువ‌ల్ డే రోజున మా ఇద్ద‌రి మ‌ధ్య ఓ పెప్పీ సాంగ్ వ‌స్తుంది. గ‌ణేష్ మాస్ట‌ర్‌గారు ఆ సాంగ్‌ను ఎంతో బ్యూటీఫుల్‌గా కంపోజ్ చేశారు. పృథ్వీ స్టెప్ట్ చాలా స్ట‌యిలిష్‌గా ఉంటాయి. సెట్ లో యూనిట్ అంతా క్లాప్స్‌, విజిల్స్ కొట్టారు. అంతా ఫ‌న్నీగా సాంగ్ ఉంటుంది.
– ఈ సినిమాలో పృథ్వీ డిఫ‌రెంట్ కామెడి చేశారు. స్పాంటేనియ‌స్ పంచ్‌లు, సెటిల్డ్ పెర్‌ఫార్మెన్స్ చేశారు. రొమాంటిక్ సీన్స్‌లో పృథ్వీ న‌ట‌న అద్భుతంగా ఉంటుంది.
– డైరెక్ట‌ర్ స‌త్తిబాబుగారు కూల్ ప‌ర్స‌న్‌. ఈ సినిమాలో ప్ర‌తి క్యారెక్ట‌ర్‌ను ఫెంటాస్టిక్‌గా డిజైన్ చేశారు. అంద‌రి నుండి త‌న‌కు కావాల్సిన పెర్‌ఫార్మెన్స్‌ను రాబ‌ట్టుకున్నారు. ఒక ఫ్రెష్ ల‌వ్‌స్టోరీని జెన్యూన్‌గా తెర‌కెక్కించారు. కామెడి, ఎమోష‌న‌ల్ సీన్స్‌ను అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఆయ‌న డైరెక్ష‌న్‌లో వ‌ర్క్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది.
– నా దృష్టిలో క‌మెడియ‌న్స్ కూడా హీరోలే. ప్ర‌స్తుతం జ‌బ‌ర్‌ద‌స్త్‌, ప‌టాస్ స‌హా అన్నీ టీవీ షోస్‌లో స్పాంటేనియ‌స్ కామెడిని క్రియేట్ చేస్తున్నారు. కామెడి సీన్స్‌లో న‌టించ‌డం చాలా క‌ష్టం. నా దృష్టిలో క‌మెడియ‌న్స్ కూడా హీరోలే. ప్ర‌స్తుతం జ‌బ‌ర్‌ద‌స్త్‌, ప‌టాస్ స‌హా అన్నీ టీవీ షోస్‌లో స్పాంటేనియ‌స్ కామెడిని క్రియేట్ చేస్తున్నారు. కామెడి సీన్స్‌లో న‌టించ‌డం చాలా క‌ష్టం. నా మ‌న‌సుకు న‌చ్చితే ఎవ‌రితోనైనా న‌టిస్తాను. నేనొక ఆర్టిస్టును కాబ‌ట్టి పెర్‌ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న ప్ర‌తి క్యారెక్ట‌ర్‌ను చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాను. అది నా బాధ్య‌త‌. ప్ర‌తి సినిమాలో ఎన్నో కొత్త విష‌యాలు నేర్చుకుంటుంటాను.
– శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ వంటి పెద్ద బ్యాన‌ర్‌లో వ‌ర్క్ చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. రాధామోహ‌న్‌గారు మంచి టెస్ట్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్‌. ఈ చిత్రాన్ని ఎంతో లావిష్‌గా నిర్మించారు. డెఫ‌నెట్‌గా ఈ సినిమా పెద్ద స‌క్సెస్ సాధించి నాకు మంచి పేరు తెస్తుంది.
– మ‌ర్యాద రామ‌న్న త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రూ విలేజ్ గ‌ర్ల్ పాత్ర‌ల్లో న‌టించ‌మ‌ని అప్రోచ్ అయ్యారు. చాలా వర‌కు అవాయిడ్ చేశాను. డిఫ‌రెంట్ లుక్‌, స్టైలిష్ క్యారెక్ట‌ర్స్ చేయాల‌నుకుంటున్నాను. అలాగే చిన్న పెద్ద అని తేడా లేకుండా అంద‌రితో న‌టించాల‌నుంది.
– హిందీలో అమితాబ్‌గారితో ఓ సినిమా డిస్క‌ష‌న్స్‌లో ఉంది. త‌మిల్‌, తెలుగు చిత్రాల‌కు సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

To Top

Send this to a friend