‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ 

01-5
‘అధినేత’, ‘ఏమైంది ఈవేళ’, ‘బెంగాల్‌టైగర్‌’వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్ని నిర్మించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌, ఇ.సత్తిబాబు కాంబినేషన్‌లో నవీన్‌చంద్ర హీరోగా నిర్మిస్తున్న చిత్రానికి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ టైటిల్‌ని ఖరారు చేశారు.
 ”సత్తిబాబు, నవీన్‌చంద్ర కాంబినేషన్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ టైటిల్‌ని కన్‌ఫర్మ్‌ చేశాం. రెండు పాటలు మినహా ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ఒక పాటను ఈనెలలో అరకులో చిత్రీకరిస్తాం. ప్రేక్షకులకు హండ్రెడ్‌ పర్సెంట్‌ వినోదాన్ని అందించే హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. సత్తిబాబు చాలా ఎక్స్‌ట్రార్డినరీగా తీస్తున్నారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది” అన్నారు.
 ”ఆడియన్స్‌ కోరుకునే పూర్తి వినోదం ఈ కథలో వుంది. యూనిట్‌లోని ప్రతి ఒక్కరి సహకారంతో సినిమా మేం అనుకున్న దానికంటే బాగా వస్తోంది. దర్శకుడుగా నాకు ఇది మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది. రాధామోహన్‌గారి బ్యానర్‌లో ఈ సినిమా చెయ్యడం హ్యాపీగా వుంది” అన్నారు.
నవీన్‌చంద్ర, శృతి సోధి, పృథ్వీ, సలోని, జయప్రకాష్‌ రెడ్డి, పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాస్‌ శ్రీను, చలపతిరావు, ధన్‌రాజ్‌, పిల్లా ప్రసాద్‌, గిరి, సన, విద్యుల్లేఖా రామన్‌, మీనా, నేహాంత్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీవసంత్‌, సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి పి., కథ, మాటలు: నాగేంద్రకుమార్‌ వేపూరి, కథా విస్తరణ: విక్రవమ్‌రాజ్‌, డైలాగ్స్‌ డెవలప్‌మెంట్‌: క్రాంతిరెడ్డి సకినాల, పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, ఎడిటింగ్‌: గౌతమ్‌రాజు, ఆర్ట్‌: కిరణ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎం.ఎస్‌.కుమార్‌, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇ.సత్తిబాబు.
To Top

Send this to a friend