మీడియా దండగా.. సోషల్ మీడియా ఉండగా..

యుద్ధం జరుగుతోంది.. ట్విట్టర్ వేదికగా యుద్ధమే జరుగుతోంది. ట్విట్టర్, ఫేస్ బుక్ రాకముందు .. మీడియాకు కొంత పవర్ ఉండేది.. ఎవరైనా తమ అనుభవాలను పంచుకోవాలంటే.. ఏదైనా గొడవ పై మాట్లాడాలంటే మీడియాను ఆశ్రయించేవారు.. కానీ సోషల్ మీడియా వచ్చాక మీడియా ప్రభావం చాలా వరకు తగ్గిపోయింది . విలేకరులను ఆహ్వానించడం .. వారికి టీ , కాఫీ టిఫిన్లు పెట్టడం.. చివరకు మాట్లాడింది… వారి పత్రికలు, చానాళ్లలో రాకపోవడం జరిగేది.. దీంతో ఆయా నాయకులు, సినీ హీరోల మనోభావాలు జనాలకు తెలిసేది కాదు.. కానీ ఇప్పుడు సోషల్ మీడియా సాక్షిగా అందరికీ వారి మనోగతాలు వెళ్తున్నాయి..

ట్విట్టర్, ఫేస్ బుక్ ల ద్వారా యుద్ధాలే జరుగుతున్నాయి. అవును పవన్ కళ్యాణ్ తన ఇంట్లో ఉండే ఏపీ ప్రత్యేక హోదా కోసం ట్విట్టర్ ద్వారా పేద్ద యుద్ధమే చేశారు. విశాఖలోని యువకులకు బూస్ట్ నిచ్చి వారిని కార్యోన్ముఖులను చేశాడు. అలా హోదా ఉద్యమం పతాక స్థాయి కి చేరింది..

ఇక రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో విమర్శల వాన కురిపించి ఫేమస్ అయ్యారు. వివాదం లేనిదే నిద్రపట్టని వర్మ చిరు, నాగబాబు, పవన్ , మహేష్ సహా అందరినీ తిట్టిపోశాడు.. చంద్రబాబు, లోకేష్ లు సైతం తమ ట్విట్టర్ ఖాతాల ద్వారా తాము చేస్తున్న పనులను జనాలతో పంచుకుంటున్నారు. ప్రధాని మోడీ అయితే మరీ తెగ వాడేస్తున్నాడు. తనకు జరిగిన చిన్న విషయాలను సైతం అందులో పోస్టు చేస్తూ సందడి చేస్తున్నాడు. ఇప్పుడు ప్రజాప్రతినిధులు, హీరోలు, ప్రముఖులకు ఏ మీడియా అవసరం లేదు.. కేవలం సోషల్ మీడియా ఉంటే చాలన్నట్లుగా ఉంది పరిస్థితి..

To Top

Send this to a friend