మిస్టర్ కోసం పవన్ వద్దకు నాగబాబు

నాగబాబు తన తనయుడి కొత్త సినిమా ప్రమోషన్ కోసం విస్తృత ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముకుందా, కంచె సినిమాలతో హిట్ లు కొట్టిన వరుణ్ పూరి జగన్నాథ్ తీసిన లోఫర్ సినిమాతో ప్లాప్ మూటకట్టుకున్నాడు. ఇప్పుడు శ్రీనువైట్లతో కలిసి మిస్టర్ అనే సినిమాను తీస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలైంది. ట్రైలర్ కు అనుకున్నంత మైలేజ్ రాకపోవడంతో ఎలాగైనా సరే సినిమాకు హైప్ తీసుకురావడానికి నాగబాబు తమ్ముడు పవన్ సాయం కోరడానికి డిసైడ్ అయ్యాడట..

ఈనెల 13న రిలీజ్ కానున్న మిస్టర్ సినిమాకు క్రేజ్ తీసుకురావడానికి మెగా ఫ్యామిలీ సపోర్టును తీసుకోవాలని నాగబాబు ప్లాన్ చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను వరుణ్ తేజ్ తో కలిసి ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశాడట.. అయితే పవన్ కళ్యాణ్ ఇలాంటి కార్యక్రమాలకు వస్తాడా రారా అన్నది తేలాల్సి ఉంది.

To Top

Send this to a friend