మిక్సింగ్ అరకు రోడ్ లో…

01-4
రాం శంక‌ర్‌, నికిషా ప‌టేల్ జంట‌గా శేషాద్రి క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం `అర‌కు రోడ్ లో`. వాసుదేవ్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రానికి మేకా బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, బి.భాస్క‌ర్‌, వేగిరాజు ప్ర‌సాద రాజు, రామేశ్వ‌రి న‌క్కా లు నిర్మాతలు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి డిటిఎస్ మిక్సింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ..  ప్రస్తుతం మా `అర‌కు రోడ్ లో` చిత్రానికి డిటిఎస్ మిక్సింగ్ జరుగుతోంది. దీంతో అన్ని కార్యక్రమాలు పూర్తి అయినట్లే. ఇటీవల విడుదలయిన ఆడియో కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావడం మాకెంతో ఆనందాన్నిచ్చింది. ముఖ్యముగా ప్రభాస్ గారు విడుదల చేసిన సాంగ్ కి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది.  దర్శకుడు వాసుదేవ్ మంచి కథ తో ఈ  సినిమాని తెరకెక్కించాడు. అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది.  అతి త్వరలో రిలీజ్ డేట్ తెలుపుతాము..అని అన్నారు.
రాం శంక‌ర్‌, నికిషా ప‌టేల్, కమల్ కామరాజు, అభిమన్యు సింగ్, కోవై సరళ, థర్టీ ఇయర్స్ పృథ్వి, కృష్ణ భగవాన్, రఘు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్, సంగీతం : రాహుల్ రాజ్, వాసుదేవ్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : జగదీశ్ చీకటి, నిర్మాతలు : మేకా బాలసుబ్రహ్మణ్యం, బి.భాస్కర్, వేగిరాజు ప్రసాద రాజు, రామేశ్వరి నక్కా; రచన, దర్శకత్వం : వాసుదేవ్.
To Top

Send this to a friend