మాహిష్మతి సామ్రాజ్యంలో ఆడియో


బాహుబలి1 ఆడియో వేడుక నిర్వహించడానికి రాజమౌళి బృందం బాగా ఇబ్బంది పడింది.. మొదట హైదరాబాద్ వేడుకను భారీగా నిర్వహిద్దామని అనుకున్నారు. హీరో నానితో యాంకరింగ్ చేయిద్దామనుకున్నారు. కానీ చివరకు సెక్యూరిటీ ప్రాబ్లంతో వేదికను తిరుపతికి మార్చి ఆడియో వేడుకను సాదాసీదాగా నిర్వహించారు. ఈ ప్రాబ్లంతో బాహుబలి 1 వేడుక కళ తప్పింది. కానీ ఈసారి అలా జరగకూడదనే ఉద్దేశంతో రాజమౌళి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాడట..

బాహుబలి2 సినిమాకు మొదటి దానికంటే మరింత ప్రమోషన్ కల్పించేందుకు రాజమౌళి వ్యూహాలు రచిస్తున్నారు. అందుకే పోస్టర్ల నుంచి విశేషాల వరకు అంతా పకడ్బందీగా చేస్తున్నారు. బాహుబలి 2 ఆడియో వేడుకను మార్చి 28, లేదా 29న విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే పాటలు, వేదికపై స్పష్టమైన ప్రకటన విడుదల చేయనున్నట్టు తెలిపారు.

కాగా రాజమౌళి ఈసారి సెక్యూరిటీ ప్రాబ్లం రాకుండా రాజమౌళి తాను బాహుబలి తీస్తున్న ఆడియో వేడుకను ప్రఖ్యాత రామోజీ ఫిలింసిటీలోనే చేద్దామని నిర్ణయించారట.. అంతేకాదు.. మాహిష్మతి రాజ్యం సెట్ వేసిన ప్రాంగణంలోనే బాహుబలి2 ఆడియో వేడుకను నిర్వహించాలని నిర్ణయించారట.. అయితే కొందరు మళ్లీ తిరుపతిలో ఆడియో వేడుక చేద్దామని అంటున్నారు… మరికొందరు హైదరాబాద్ లోనే చేయాలని నిర్ణయించారట.. కానీ అంతిమంగా రాజమౌళి రామోజీ ఫిలింసిటీలోని మాహిష్మతి సెట్ లోనే నిర్వహించాలని డిసైడ్ అయినట్టు సమాచారం.

To Top

Send this to a friend