మార్చి 31 వరకు అంతా ఫ్రీనే.. హామీ ఇచ్చిన జియో..

reliance-jio-apnewsonline

టెలికాం రంగంలో విప్లవాత్మకంగా దూసుకొచ్చిన రిలయన్స్ జియో దేశ ప్రజలకు అంతా ఫ్రీ ఇచ్చి అందరి మదిని దోచుకుంది. మొదట డిసెంబర్ 31 వరకు కాల్స్, ఎస్ఎంఎస్, డేటా ఉచితంగా అందించిన జియో ఆ తర్వాత న్యూ ఇయర్ ఆఫర్ అంటూ మార్చి 31 వరకు ఉచిత సేవలు అందించేందుకు సిద్ధమైంది. కాగా దీనిపై ఎయిర్ టెల్, ఐడియా తదితర టెలికాం ఆపరేటర్లు కేంద్ర ప్రభుత్వ ట్రాయ్ కి ఫిర్యాదు చేశాయి. దీంతో దీనిపై వివరణ ఇవ్వాలని. లేదంటే ఉచిత ఆఫర్లను రద్దు చేస్తామని కేంద్ర ట్రాయ్ హెచ్చరించింది. ఈ పరిణామాలతో ఉచిత సర్వీసులు జియోనుంచి ఆగిపోతాయని జనం భయపడ్డారు. కానీ జియో దీనిపై ట్రాయ్ కు రాతపూర్వకంగా వివరణ ఇవ్వడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది..
డిసెంబర్ 31 వరకు అపరిమితంగా ఫ్రీ ఇచ్చామని.. ఆ తర్వా త న్యూ ఇయర్ ఆఫర్ అంటూ ఇచ్చింది కేవలం పరిమిత కాల రిచార్జ్ చేసుకునే ఆఫర్ అంటూ ప్రకటించింది. ఇవి రెండు వేర్వేరు ఆఫర్లని.. వేరు వేరు కస్టమర్లకు దీన్ని అందిస్తున్నామని స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతానికి ట్రాయ్ సంతృప్తి పడి జియో ఆఫర్లపై నిషేధం ఏమీ విధించలేదు. ప్రస్తుతానికి జియో కస్టమర్లు మరో 3 నెలల పాటు ఉచిత కాల్స్, ఎస్ఎంఎస్ చేసుకునే వీలు కలిగింది..

To Top

Send this to a friend