మానవీయ కోణంలో మనసున్న మారాజు.. కేసీఆర్

kcr-apnewsonlinein

ఎవ్వరూ అడగని పథకాలను ప్రకటించేస్తారు.. ఇది మంచి అని తెలిస్తే చాలు దాని కోసం ఎంత ఖర్చు అయినా పెడతారు.. మేనిఫెస్టో.. గీని ఫెస్టో అంటూ నియమ నిబంధనలు పాటించరు.. పేదలకు మంచి జరుగుతుందంటే కరుణ చూపుతారు.. సీఎం కేసీఆర్ మరోసారి తనలోని మానవీయ కోణాల్ని ఆవిష్కరించారు. నా ఆనేవాళ్లు లేకుండా ఉండే అనాథ ఒంటరి మహిళలకు నెలకు రూ.వెయ్యి జీవనభృతి కింద అందించేందుకు నిర్ణయించారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంపై వివిధ సంక్షేమ పథకాల అమలు వల్ల పెద్ద ఎత్తున భారం పడుతోంది. మిషన్ భగీరథ, ప్రాజెక్టులు, కాకతీయ లాంటి పెద్ద పథకాలను చేపట్టారు. అయినా కూడా కేసీఆర్ ఆ భారాన్ని లెక్కచేయకుండా మానవీయ కోణంలో ఒంటరి మహిళలకు పింఛన్ ఇవ్వాలని నిర్ణయించి తన ఉదారతను చాటుకున్నారు..

రాష్ట్రంలో ఒంటరి మహిళలు దాదాపు 2 నుంచి 3 లక్షల మంది వరకు ఉంటారు. పురుషులు ఎక్కడైనా పనిచేసుకొని బతుకగలరు.. కానీ స్త్రీలకు ఆ ఫెసిలిటీ ఉండదు.. మాన ప్రాణాల విషయంలో రక్షణ కరువు.. అందుకే వారి కోసం కేసీఆర్ ప్రత్యేకంగా ఈ పథకాన్ని రూపొందించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. శాసనసభలో శుక్రవారం ఈ మేరకు ప్రకటన చేయగానే సభ యావత్తు కరతాళ ధ్వనులతో మారుమోగింది.. కేసీఆర్ నిర్ణయానికి గులాం చేసింది..

To Top

Send this to a friend