మానవత్వం పరిమళించింది.. మంత్రగాడు మనిషిలా మారాడు..

నైజిరియా పేద దేశం.. ఆకలి కేకలతో అక్కడి ప్రజలు నిత్యం పోరాడుతూనే ఉంటారు. అక్కడ మంత్రాలు, తంత్రాలంటూ మూఢనమ్మకాలు ఎక్కువే.. ఆకలికేకల రాజ్యంలో పేదలకు కనీసం మూడు పూటల తిండి.. తాగడానికి నీళ్లు కూడా కరువే.. అంతటి దుర్భర దేశంలో ఓ ఇంటి ఓ చిన్న పిల్లాడు జన్మించాడు. వింత ఆకారంలో శరీరంపై కండ లేకుండా.. వంగిపోయి.. చూడగానే మంత్రగాడి ముఖంతో కనిపించాడు. మూఢాచారాలు నమ్మే ఆ నైజిరీయన్ కుటుంబం.. ఆ పిల్లాడిని మంత్రగాడని నమ్మి.. గ్రామస్థుల సూటిపోటి మాటలతో రోడ్డు పాలు చేసింది.. అలా దొరికింది తింటూ ఆ రెండేళ్ల బాలుడు కనీసం బట్టలేకుండా రోడ్ల వెంట తిరుగుతూ నరకయాతన పడుతుండేవాడు. ఓ రోజు నైజిరియాలో స్వచ్ఛంద సేవలు చేస్తున్న విదేశీ బృందంలోని లావెన్ అనే మహిళ కార్యకర్త ఆ మంత్రగాడని ముద్రవేసిన పిల్లాడిని చూసింది. బక్కచిక్కిపోయి.. శరీరం మొత్తం బొక్కలు తేలి కళావిహీనంగా.. చావుకు దగ్గర ఉన్న అతడికి తిండి, పానీయాలు అందించి తనతో తీసుకెళ్లింది. నైజీరియన్లకు మూఢనమ్మకాలతో పసిప్రాణాలు తీయొద్దని అవగాహన కల్పించింది.
సరిగ్గా ఏడాది తిరిగేసరికి.. ఆ మంత్రగాడని ముద్రవేసిన బాలుడు.. ఇప్పుడు మానిషిలా మారాడు. బక్కచిక్కిన అతడి శరీరం ఓ రూపుకు వచ్చింది.. మందులు, మాకులు పెట్టి పుష్టికర ఆహారం పెట్టి లావెన్ అతడిని బతికిచ్చింది. ఇప్పుడా ఆ బాలుడు బ్యాగుచేతపట్టి రోజూ స్కూలుకు వెళ్తున్నాడు. లావెన్ తాను బాలుడిని చేరదీసినప్పటి ఫొటోను.. ఇప్పటి ఫోటోను పెట్టి.. మానవత్వం అంటే ఇది అని నిరూపించింది.. ప్రపంచానికి కనువిప్పు కలిగించింది.. ఆ రెండు ఫొటోలను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend