మహేశ్ సినిమాను కాదని.. దిల్ రాజుతోనా..?

mahesh-babu_vamsi-paidipally-apnewsonline

లేట్ గా అయినా లేటెస్ట్ గా విజయాన్ని అందుకున్న నిర్మాత ప్రసాద్ వి. పొట్లూరి. ఆయన ఇంగ్లీష్ చిత్రం ఆధారంగా తెరకెక్కిన చిత్రం.. ఊపిరి. ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. దర్శకుడు వంశీ పైడిపల్లి చక్కగా తీర్చిదిద్దాడు. నాగార్జున, కార్తి నటించిన ఈ మూవీ తెలుగు తమిళ భాషల్లో బాగా ఆడింది. ఇప్పటికీ ఈ సినిమా ఫీల్ గుడ్ గా పేరు సంపాదించింది.. ఈ చిత్రం విజయంతో అప్పుడే నిర్మాత ప్రసాద్, దర్శకుడు వంశీ పైడిపెల్లిలు స్టార్ హీరోతో సినిమా చేయడానికి ఒప్పందం చేసుకున్నారు.. అక్కడికి కట్ చేస్తే..
వంశీ పైడిపెల్లి ఇటీవల దిల్ రాజు, అశ్వినీదత్ లతో సినిమా చేస్తానని ప్రకటించారు. దీంతో వివాదం అలుముకుంది. ప్రసాద్ వి.పొట్లూరి దీనిపై నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. మద్రాస్ హైకోర్టులో కూడా ఫిర్యాదు చేశాడు. వంశీ తనతోపాటు మహేశ్ సినిమా విషయంలో రాకపోతే నష్టపరిహారం అందించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈ వివాదం ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యింది.

To Top

Send this to a friend