మహేశ్ బాబుకు షాకిచ్చిన చిరంజీవి


మహేశ్ బాబుకు మెగాస్టార్ చిరంజీవి షాక్ ఇచ్చారు. మురగదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్ లో జరుగుతోంది.. ఇందులోకి మెగాస్టార్ వచ్చి ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం మెగాస్టార్ హోస్ట్ గా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రొగ్రామ్ కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే జరుగుతోంది. తన ప్రొగ్రామ్ అయిపోగానే చిరంజీవి మహేశ్ సినిమా షూటింగ్ తెలుసుకొని అక్కడి వచ్చి సప్రైజ్ చేశారు. దీంతో ఉబ్బితబ్బైన సూపర్ స్టార్ మహేశ్, మురగదాస్ లు ఆయనతో కాసేపు మాట్లాడారు. ఆ సినిమా కెమెరా మ్యాన్ సంతోష్ శివన్ ఫొటో తీసి దీన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

To Top

Send this to a friend