మహేశ్ దెబ్బైపోయాడు.. ఎన్టీఆర్ బతికిపోయాడు..

రాజకీయం రంగు ఓ హీరోను దెబ్బతీసింది.. దాని మీద స్పందింద్దామనుకున్న మరో హీరో ఆ పరిణామాలను చూసి వెనక్కి తగ్గడం కలిసి వచ్చింది.. ఇందులో బాధితుడు హీరో మహేశ్ బాబు కాగా.. బతికిపోయినవాడు జూనియర్ ఎన్టీఆర్…
జల్లికట్టు ఉద్యమం తారాస్థాయికి చేరిన వేళ.. మహేశ్ బాబు జల్లికట్టుకు మద్దతుగా మాట్లాడి తమిళ అభిమానుల ఆదరణ పొందారు. కానీ ఆ తర్వాత జల్లికట్టు స్ఫూర్తితో ఎగిసిపడిన ప్రత్యేక హోదా ఉద్యమంపై వ్యాఖ్యానించక ఏపీ ప్రజల్లో విలన్ అయ్యాడు. ఇదే విషయాన్ని ట్విట్టర్ రాంగోపాల్ వర్మ లేవనెత్తి.. ఏపీ ప్రజల దృష్టిలో మహేశ్ ద్రోహీ అని దుమ్మెత్తిపోశాడు. అలా మహేశ్ బాబు ప్రత్యేక హోదా విషయంలో సైలెంట్ గా ఉండడం ఆయనకు నష్టం చేకూర్చింది. అక్కడికి కట్ చేస్తే..
మహేశ్ తో పాటు జల్లికట్టు ఉద్యమంపై జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందింద్దామనుకున్నాడట.. సన్నిహితులతో ఈ విషయంపై చర్చించి స్పందించేలోగానే మహేశ్ స్పందించడం.. దానిపై వ్యతిరేకత రావడం చకచక జరిగిపోయాయి. దీంతో మనకెందుకు వచ్చిన గొడవ అని ఎన్టీఆర్ జల్లికట్టుపై స్పందించలేదు. దీంతో హోదాపై కూడా ఆయన సైలెంట్ గా ఉండడంతో ఎన్టీఆర్ పై ఎక్కడా వ్యతిరేకత రాలేదు. కానీ మహేశ్ మాత్రం హోదా పై స్పందించక ఏపీ ప్రజల దృష్టిలో నెగెటివ్ మార్కులు తెచ్చుకున్నాడు..

To Top

Send this to a friend