మహేశ్ తో సినిమా పక్కా.. కానీ పీవీపీతో కాదు..

mahesh-babu_vamsi-paidipally-apnewsonline

డైరెక్టర్ పైడిపెల్లి వంశీ, ప్రొడ్యూసర్ పీవీపీ వివాదంలో సరికొత్త ట్విస్ట్ .. మహేశ్ బాబు కొత్త సంవత్సరం కానుకగా తన తరువాతి సినిమాల లిస్ట్ ను బయటపెట్టాడు. అందులో దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో సినిమా చేస్తానని తెలిపాడు. కాగా దీనిపై ప్రొడ్యూసర్ పీవీపీ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.. ఊపిరి సినిమా తర్వాత తన బ్యానర్ లో సినిమా తీస్తానని వంశీ మోసం చేశాడని.. ఊపిరి నష్టాలకు తన కు పరిహారం ఇప్పించి తనతోనే సినిమా తీసేలా చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా ఈ వివాదంలో ఎట్టకేలకు వంశీ స్పందించారు. ఊపిరి సినిమా కమర్షియల్ హిట్ అని దానికి నష్టాలు రాలేదన్నారు. లాభాలు వచ్చాయని ఇదీ పీవీపీ చెప్పారని.. ఈ కేసును తాను న్యాయపరంగా ఎదుర్కొంటానని వంశీ స్పష్టం చేశారు. దీంతో మహేశ్ సినిమా వివాదం వంశీ, పీవీపీ లమద్య వార్ గా ముదిరిపోయింది..

To Top

Send this to a friend