మహేశ్ గ్లామర్ రహస్యం తెలిసిపోయింది..

అందరి హీరోలు ఒక ఎత్తు.. మహేశ్ బాబు ఒక ఎత్తు.. ఎవర్ గ్రీన్ గ్లామర్ మహేశ్ సొంతం.. అందరూ ఏజ్ లా కనిపించినా.. మహేశ్ ఇప్పటికీ చాక్లెట్ బాయ్ లా మెరిసిపోతూనే ఉంటాడు.. మరి ఇంత గ్లామర్ గా ఉండడానికి మహేశ్ ఏం చేస్తాడు. ఏం తింటాడు.. అనేది ఎవ్వరికీ తెలీదు.. కానీ తన కొత్త చిత్రం మురగదాస్ తో తీస్తున్న సినిమా మధ్యలో మహేశ్ బాబు మలేషియా టూర్ వెళ్లాడట.. శరీరానికి డీ టాక్సినేషన్ చేయించుకునేందుకే వెళ్లాడని చిత్రం యూనిట్ ద్వారా తెలిసింది..

మహేశ్ బాబు ఏటా రెండు సార్లు ఫారిన్ టూర్ వేస్తుంటారు.. అది ఫ్యామిలీతో కలిసి.. అందరూ అది హాలీడే ట్రిప్ అనుకుంటారని మనకు తెలుసు.. కానీ దాంతోపాటు ఆరోగ్య సంరక్షణ దాగి ఉందని తెలిసింది.. డీ టాక్సినేషన్ ఏడాదికి రెండు సార్లు మహేశ్ చేయించుకుంటారట.. ఈ చికిత్సలో మలినాలను శరీరం నుంచి తొలగిస్తారు. కొన్ని మెడిసిన్స్, కొంత ఎక్సర్ సైజ్, కొంత మసాజ్ చేస్తారు.. ఈ చికిత్సలో చెమటల ద్వారా బాడీలోని మలినాలను బయటకు పోయేలా చేస్తారు.. ఇంతకుముందు కూడా మహేశ్ ఇలానే ఫారిన్ టూర్లు, దేశంలోని డెహ్రాడూన్ కు వెళ్లి డీ టాక్సినేషన్ చేయించుకున్నాడట.. సో మహేశ్ గ్లామర్ వెనక ఈ టాక్సినేషన్ ఉందన్నమాట..

To Top

Send this to a friend