మహేశ్ కోసం అన్నీ వదిలేశా..


టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒకటే టాక్.. చాన్నాళ్ల తర్వాత మహేశ్ భార్య నమ్రత సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందన్న మాట అంతటా వ్యాపించింది. మురగదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు ప్రస్తుతం ఓ భారీ ప్రాజెక్టును చేస్తున్నారు. ఇందులో మహేశ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో నమ్రత గెస్ట్ రోల్ లో నటిస్తున్నారని పుకార్లు షికారు చేశాయి.

కానీ దీనిపై మహేశ్ బాబు భార్య నమ్రత క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను బాగా బిజీగా ఉన్నానని తెలిపింది. అభిమానులు భావిస్తున్నట్టుగా తాను సినిమాల్లో నటించడం లేదని స్పష్టం చేసింది. ప్రిన్స్ షూటింగ్ డేట్స్, ఎండార్స్ మెంట్, పిల్లలను చూసుకోవడానికే సమయం సరిపోతోందని.. ఇక సినిమాల్లో నటించే తీరికే ఎక్కడిదని మనసులోని మాటను బయటపెట్టింది..

నమ్రత జీవితంలోకి వచ్చాకే మహేశ్ సినిమాల్లో వైరెటీ.. కాస్త నాణ్యత, స్టైలిష్ పెరిగాయి. అంతకుముందు మూస కథలతో నెట్టుకొచ్చారు. పోకిరీ లాంటి భారీ హిట్ పడింది. మహేశ్ లుక్ చేంజ్ చేయడంలో నమ్రత కీరోల్ పోషించిందట.. అందుకే ఇప్పుడు ఈ హీరోకు అన్ని దగ్గరుండి చక్కబెడుతోంది. ఇక సినిమాల్లో నటించనని తెగేసి చెప్పింది మాజీ మిస్ ఇండియా నమ్రత..

To Top

Send this to a friend