మహిళల్ని గౌరవించే తీరు ఇదేనా ‘బాబూ’?

వెంకయ్య కూతురు, చంద్రబాబు కోడలు.. చివరకు ప్రత్యర్థి కేసీఆర్ కుమార్తె కూడా హాజరై ప్రసంగించారు. కానీ ఏపీ రాష్ట్రానికి చెందినవారు.. స్వయంగా ప్రతిపక్ష నేత ఎమ్మెల్యే రోజాను ఆహ్వానించి మరీ చంద్రబాబు సర్కారు ఆమెను అవమానించిన తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రోజాను పోలీసులు అడ్డుకొని వాగ్వాదానికి దిగారని.. ఆమె కిందపడిపోయారని తెలిసింది.. ఇంతకంటే
దారుణం.. మరోటి ఉండదు..

దేశంలోనే ప్రతిష్టాత్మక మహిళా పార్లమెంటు సదస్సు అమరావతి లో జరుగుతుండగానే ఏపీ మహిళకే అవమానం జరగడమా..? ఇంతకంటే అమానుషం ఇంకోటి ఉండదు.. ఓ పక్క మహిళలు గొప్పవాళ్లు.. అంటూ పార్లమెంటేరియన్ల సదస్సులో ఊదరగొడుతున్న చంద్రబాబు, ఆయన భజన మంత్రులు మరోవైపు తమకు వ్యతిరేకులైన ప్రతిపక్ష పార్టీల మహిళా ఎమ్మెల్యేలు, ప్రముఖుల విషయంలో అవమానకంగా వ్యవహరించడం వివాదాస్పదమైంది.. అమరావతి సాక్షిగా.. సీఎం చంద్రబాబు చేస్తున్న ఈ అవమానాలకు మహిళాలోకం మండిపడుతోంది..

తెలంగాణ, ఏపీ ఉప్పు నిప్పులా విడిపోయాయి. కేసీఆర్ చంద్రబాబుల మధ్య పెద్ద వైరమే నడిచింది. అయినా కూడా ఈ పార్లమెంటేరియన్ సదస్సుకు ఏపీ సీఎం చంద్రబాబు .. కేసీఆర్ కుమార్తె ఎంపీ కవితను ఆహ్వానించారు. ఆమెకూడా హాజరయ్యారు. ఏపీ మంత్రులు సన్మానించారు. కవిత కూడా చాలా హుందాగా వ్యవహరించి చాలా అద్భుతమైన ప్రసంగం చేశారు. రాజకీయ ప్రత్యర్థులైన పార్టీల నుంచి ప్రత్యర్థుల్ని ఆహ్వానించిన చంద్రబాబు.. ఏపీ రాష్ట్రానికే చెందిన ప్రతిపక్ష ఎమ్మెల్యే రోజా విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించారు. ప్రత్యర్థి అన్న నెపంతో దుర్మార్గంగా ఆమెను అరెస్ట్ చేసి కారులోంచి పడిపోయినా పట్టించుకోకుండా పోలీసులతో లాక్కెల్లిపోవడం గమనార్హం..

రాజకీయాలెన్ని ఉన్నా కానీ.. ఏపీ ప్రతిపక్ష ఎమ్మెల్యే పట్ల వ్యవహరించిన తీరు.. ఏపీలో ఆటవిక పాలనను సూచిస్తోంది.. పైగా ఈ సదస్సుకు ‘మహిళల్ని వంటింటికే పరిమితమవ్వాలని వ్యాఖ్యానించి నాలుక కరుచుకున్న’ ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అధ్యక్షత వహించడం కంటే దరిద్రం ఇంకోటి ఉండదు.. ఆయన కోడలు ఇప్పటికీ వారి కుటుంబం పై కేసు వేసి రోడ్ల వెంట తిరుగుతున్నా పట్టించుకోని కోడెల.. మహిళా సాధికారితపై ప్రసంగించడం.. మహిళల్ని సన్మానించడం నివ్వెరపరుస్తోంది..

మహిళ పార్లమెంటేరియన్ సదస్సు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.. అదేమీ చంద్రబాబు , ఏపీ సర్కారు జేబులోంచి పెడుతున్న ఖర్చు కాదు. అయినా కూడా చంద్రబాబు కోడలు, వెంకయ్య కూతురు , తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కు ఇచ్చిన గౌరవం ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యే రోజాకు ఇవ్వకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఆహ్వానించి మరీ ఇంత నీచంగా అవమానించిన చంద్రబాబు వైఖరిపై మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారు. విదేశాల నుంచి దేశంనుంచి ఎంత మంది వస్తేనేం.. వారంతా బాబు కు నచ్చిన.. మెచ్చిన వారే.. ప్రత్యర్థులనుకున్న వాళ్లు ఎంత మేధావులైనా ఈ సదస్సు కు రాలేదు. వస్తే బాబు బండారం బయటపడుతుందేమోనన్న సందేహం ఆయనది..

రేపు పొద్దున టీడీపీ ప్రభుత్వం దిగిపోయి వైసీపీ గద్దెనెక్కితే రోజా చేతిలో అధికారం ఉంటే చంద్రబాబుకు ఇదే గతి అని మనం అర్థం చేసుకోవాల్సిందే.. ఇంత దిగజారిన రాజకీయాలు చేసిన చంద్రబాబుకు రేపొద్దున యాంటి పాలిటిక్స్ లో అదే గతి పట్టదన్న గ్యారెంటీ లేదు. అందుకే రాజకీయాలు ఎప్పుడూ ఒకలా ఉండవు.. వాటిని తెలుసుకొని మసులుకుంటె మంచింది. ఎంతో గొప్ప సదస్సు నిర్వహించానని చెప్పుకుంటున్న చంద్రబాబు.. రోజా విషయంలో వ్యవహరించిన తీరుతో అంతా బూడిదలో పోసిన పన్నీరు లా మారింది. వేదికపై నీతులు.. బయట గోతులు తీసిన చంద్రబాబుకు ఇది శరాఘాతంగా మారింది..

To Top

Send this to a friend