మహా అద్భుతం.. బాహుబలి ట్రైలర్ రిలీజ్

యుద్ధతంత్రం.. రాజ్యం కోసం పోరాటం.. జనం కోసం ఆరాటం.. ప్రేమపై మమకారం.. చివరకు పగ, మోసంతో అంతర్థానం.. మహేంద్ర బాహుబలి ట్రైలర్ పరమార్థం..

బాహుబలి2 ట్రైలర్ చూశాక కథ, కథనం సినిమా ఎలా ఉండబోతుందనే విషయం సుస్పష్టమైంది. రాజ్యం కోసం.. జనం కోసం సింహాసనం అధిష్టించిన బాహబలి అనంతరం అనుష్క ప్రేమలో పడిపోయినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఆ తర్వాత సింహాసనం రాజ్యమా లేక ప్రేమనా తేల్చుకోవాల్సిన స్థితి విలన్ భళ్లాలదేవతో ఫైటింగ్.. శివుడిపై బాహుబలి రక్తం కారడం లాంటి ఎమోషనల్ సీన్లను బాగా తీశారు.

ఇక గ్రాఫిక్స్ వర్క్ మహా అద్భుతంగా ఉంది. మహా ఏనుగుపై జాలువారుతున్న నీరు.. పక్కన నది.. అనుష్క అందాలు.. అడవిలో సీన్లు.. మహిష్మతి రాజ్యం.. వారి రాజమందిరం.. అద్భుతంగా గ్రాఫిక్స్ చేశారు. మామ కట్టప్పపై బాహుబలి అభిమానం.. చివర్లో బాహుబలి-భళ్లాల దేవ ఫైటింగ్ చూపించారు. ఇలా ఆద్యంతం యుద్ధ సన్నివేశాలు.. బాహుబలి పరాక్రమాన్ని తెరపై చూపించి మహా వండర్ క్రియేట్ చేశారు రాజమౌళి..

బాహుబలి 2 ట్రైలర్ కోసం కింద వీడియోను చూడండి..

To Top

Send this to a friend