మల్లెమాలను ఎంచుకొన్న రామౌజీ రావు నిర్ణయం కరెక్టా?

అవును.. పైన హెడ్డింగ్ కరెక్టే.. రామౌజీరావు.. తన ఇద్దరు కుమారులు సుమన్, కిరణ్ లకు చెరో వ్యాపారాన్ని అప్పగించారు. కిరణ్ ను ఈనాడు దినపత్రికకు ఎండీని చేశారు. సుమన్ ను ఈటీవీ చానెల్ పెట్టి దాని బాధ్యతలు అప్పగించారు. ఇద్దరిలో కిరణ్ తండ్రి బాటలో నడిచి ఈనాడు పత్రికను ఇప్పుడు తెలుగు రాష్ట్రంలోనే అత్యధిక సర్క్యూలేషన్, ఆదరణ గల పత్రికగా నిలబెట్టడంలో సక్సెస్ అయ్యాడు. అదే దివంగత సుమన్.. మొదట్లో ఈటీవీని నిలబెట్టాడు. అంతరంగాలు, తదితర మెగా సీరియళ్లను నిర్మించి జనంలో విశేష ఆదరణ సంపాదించారు. కానీ ఆ తరువాత జెమనీ టీవీ, మాటీవీల దెబ్బకు, అత్యాధునిక, నవ పోకడలు అందుకోవడంలో సుమన్ విఫలమయ్యారు. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు ఈటీవీ మారలేదు. అవే మూస సీరియళ్లతో ఈటీవీ రేటింగ్ రోజురోజుకు పడిపోయింది. సుమన్.. ప్రభాకర్ ను చేరదీయడం.. పలు సీరియళ్లు, షోలు అప్పగించడం.. ఈటీవీ భష్ట్రు పట్టిపోవడం జరిగిపోయింది. దీంతో రామోజీ రావు సుమన్ ను, ప్రభాకర్ ను ఈటీవీ బాధ్యతల నుంచి తీసేశాడు… ఆ తరువాత సుమన్ కు బ్లడ్ క్యాన్సర్ సోకడం.. ఆయన పరమపదించడం జరిగిపోయింది. దీంతో రామౌజీ మళ్లీ తన ఈటీవీని నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా అప్పటివరకు నిర్మాతగా పలు సినిమాలు తీసి చేతులు కాల్చుకున్న శ్యాంప్రసాద్ రెడ్డిని సంప్రదించారు. పలు షోలు నిర్వహించి ఈటీవీని గట్టెక్కించాలనేది వారి ప్రయత్నం..

శ్యాంప్రసాద్ రెడ్డి ట్రాక్ రికార్డ్ ఏమీ బాగాలేదు.. 1987 నుంచి శ్యాం ప్రసాద్ రెడ్డి మల్లెమాల ప్రొడక్షన్ పేరుతో తలంబ్రాలు.. అభిరుచి, అంకుశం, ఆగ్రహం, అమ్మోరు.. అంజి, ఇలా కొన్ని సినిమాలు హిట్.. కొన్ని ప్లాపులతో సినిమాలకు నెట్టుకొస్తున్నారు. చివరగా తీసిన అరుంధతి గ్రాండ్ హిట్ అయ్యింది.. ఆయన చేతిలో ఈటీవీని పెట్టిన రామౌజీరావు సక్సెస్ సాధించారు. మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి ప్రారంభించిన జబర్ధస్త్ గ్రాండ్ హిట్ అయ్యింది. ప్రతి గురు, శుక్రవారాలు వస్తున్న ఈ షోను చూడడానికి అందరూ 9.30కి ఇంటిపట్టున ఉంటారంటే కామెడీ టైమింగ్ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు జబర్దస్త్ తోనే ఈటీవీ టాప్ రేటింగ్ కు వచ్చింది. ఆ తర్వాత ఈటీవీ ప్లస్ తో పటాస్ ప్రోగ్రాంతో మరోసారి ఆ చానల్ ను నిలబెట్టారు మల్లెమాల అధినేత…

జబర్దస్త్ జడ్జి, మెగా బ్రదర్ నాగబాబు సోమవారం విలేకరులతో మాట్లాడారు. జబర్దస్త్ ప్రస్తుతం తెలుగు టీవీ చానాల్లలోనే టాప్ షో అని కితాబిచ్చరు. నీట్ కామెడీతో ఫ్యామిలీ మొత్తాన్ని అలరిస్తున్న షో ఇదేనని స్పష్టం చేశారు. మల్లెమాల , శ్యాంప్రసాద్ రెడ్డి కృషి వల్లే ఈరోజు జబర్ధస్త్, ఈటీవీ ఈ స్థాయిలో ఉందని కితాబిచ్చాడు. అదీ అక్షరాల నిజమనడంలో ఎలాంటి సందేహం లేదు.

To Top

Send this to a friend