మరి పవన్ దారెటు?


చంద్రబాబుకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఎవ్వరూ పోరాడడానికి ముందుకొచ్చినా వారితో కలుపుకుపోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అమరావతిలో విలేకరులతో మాట్లాడిన జగన్ ఈ సందర్భంగా విలేకరుల అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.. పవన్ కళ్యాణ్ కలిసి వస్తే ఆయనతో కలిసి ఎన్నికల బరిలో నిలుస్తారా అని జగన్ ను ప్రశ్నించగానే ‘కలుపుకునే కార్యక్రమం చేస్తాం.. కానీ పవన్ పరిస్థితి ప్రస్తుతం చంద్రబాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ అనే విధంగా ఉంది. బాబు ప్రమేయం లేకుండా ఆయన నోటినుంచి ఒక్కమాట రావడం లేదు. ముందు ఈ పరిస్థితుల్లోంచి పవన్ బయటపడాలని కోరుకుంటున్నా..’ అని జగన్ పవన్ వ్యవహారశైలిపై విమర్శలు గుప్పించారు..

2019 ఎన్నికలు ఏపీకి అత్యంత కీలకం కానున్నాయి. 5 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న జగన్ అధికారం కోసం తీవ్రంగా పోటీపడుతున్నారు. మరో వైపు హామీ ఇవ్వని చంద్రబాబు కాడి వదిలేసి పవన్ సొంతంగా రాజకీయ అరంగేట్రం చేయడానికి రెడీ అయిపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే రాజకీయ పరిస్థితులు ఆసక్తి రేపుతున్నాయి..

మరో వైపు జగన్ విలేకరుల సమావేశంలో పవన్ తో కలవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. నిజంగా వీరిద్దరు కలిస్తే ఏపీలో అధికారం తథ్యం.. మరి జగన్ ఇచ్చిన సాదర ఆహ్వానానికి పవన్ స్సందిస్తారా..? బాబును వదిలి జగన్ వైపు నిలబడతాడా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న..

To Top

Send this to a friend