మనోజ్ హీరోగా “గుంటూరోడు”

gunturodu-apnewsonline

క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా S.K. సత్య దర్శకత్వంలో రూపొందుతున్న నూతన చిత్రానికి గుంటూరోడు అని టైటిల్ ఖరారు చేసారు. ఈ చిత్రం గుంటూరు నేపధ్యంలో జరిగే కథాంశం అవ్వడం వలన ఈ టైటిల్ పెట్టటం జరిగింది. ఇది పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ అని అందరిని అలరించే విధంగా వుంటుందని డైరెక్టర్ తెలియజేసారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. డిసెంబర్ చివరి వారంలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నామని నిర్మాతలు తెలియజేసారు.

మంచు మనోజ్ సరసన కథానాయకిగా ప్రగ్యా జైస్వాల్ (కంచే ఫేమ్) నటించనుండగా ముఖ్య పాత్రలలో రాజేంద్ర ప్రసాద్, సంపత్, కోటశ్రీనివాసరావు, ప్రవీణ్, సత్య, జెమినీ సురేష్, కాశీ విశ్వనాథ్ తదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక వర్గం .. సంగీతం: DJ శ్రీ వసంత్, సినిమాటోగ్రఫి : సిద్దార్ధరామస్వామి,

ఆర్ట్ డైరెక్టర్: సత్య శ్రీనివాస్, ఫైట్స్ : వెంకట్ , కో– డైరెక్టర్ T. అర్జున్,

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: బుజ్జి, సురేష్ రెడ్డి ,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రభు తేజ,

నిర్మాత : శ్రీ వరుణ్ అట్లూరి,

కధ, స్క్రీన్ ప్లే , మాటలు, దర్సకత్వం : S.K. సత్య

To Top

Send this to a friend