మనసున్న రాజకీయ నాయకుడు పవన్

pawan-kalyan-visit-uddanam-victims-of-kidney-disease

ఆవేశంగా రాజకీయాల్లోకి వచ్చినా.. చాలా ఆలోచనతో పవన్ ముందుకెళ్తున్నారు.. ఇంతవరకు ఎవరూ పోరాడని అంశాలను ఎజెండా పెట్టుకొని ప్రజల మనసులను చూరగొంటున్నారు.. పవన్ కళ్యాణ్ అంటేనే ఒక విలక్షణం. ఆయన వ్యక్తిత్వం.. స్పందించే తీరు ఆకట్టుకుంటాయి. అమరావతి నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు అండగా నిలబడినా.. ఆయన అంతరంగం బడుగు బలహీన వర్గాల శ్రేయస్సుకే అంకితం.
గొప్ప నాయకుడు కావాలంటే ముందు గొప్ప మనసు ఉండాలి. పేదల సమస్యలను గుర్తించాలి. ఇప్పుడు పవన్ అదే చేస్తున్నాడు.. శ్రీకాకుళంలోని ఉద్దానం బాధితుల కష్టాలు తెలుసుకునేందుకు నేరుగా వెళ్తున్నాడు.. ఉద్దానం అంటేనే ఓ దీనగాథ.. అక్కడ ఇంటికొకరు కిడ్నీ బాధితులున్నారు. ఇంకా వచ్చే తరం కూడా కిడ్నీ బాధితులుగా మారిపోతున్నారు. ఉద్దానం ఏరియాలోని నీటి వల్లే కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారని ప్రాథమికంగా తేలింది. నీటిలోని అధిక సిలికాన్ వల్ల కిడ్నీలు దెబ్బతింటున్నాయని పరిశోధకులు ప్రాథమికంగా అంచనావేశారు. ఈ వ్యాధికి చికిత్స చేయించుకునేకు దగ్గర్లో ఆస్పత్రి లేక చాలా మంది మృత్యువాత పడ్డారు. పిల్లలు, పెద్దలు తమ సంపాదనలో కిడ్నీ వ్యాధులకే ఖర్చు పెట్టుకొని తమ ఇళ్లు వాకిల్లు అమ్ముకుంటున్నారు. ఎన్నో పత్రికలు, చానాళ్లు, జాతీయాంశంగా దీన్ని తీసుకెళ్లినా కూడా ఉద్దానం ను ఉద్దరించిన నాయకుడు ఇప్పటి వరకు లేడు. కానీ పవన్ స్పందించాడు. దానిపై డ్యాక్యుమెంటరీ చిత్రించి ట్విట్టర్ లో పెట్టాడు. వారి కష్టాలు తీర్చేందుకు స్వయంగా వెళుతున్నాడు..
ఈరోజు పవన్ ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులతో సమవేశమై వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తనవంతుగా సహాయసహకారాలు అందించారు. కిడ్నీవ్యాధిగ్రస్తుల సమస్యను ప్రపంచానికి పరిచయం చేసిన పవన్ తన రాజకీయ ఎదుగుదలకు దీన్నొక చక్కటి అవకాశంగా ఉపయోగించుకున్నారు. అటు వారి సమస్య తీరుతుంది. ఇటు పవన్ కు రాజకీయంగా ప్లస్ అవుతుంది. ఓట్ల రాజకీయాలు చేసే రాజకీయ నాయకుల కన్నా మనసున్న ఈ రాజకీయ నాయకుడు పవన్ మిన్న అనడంలో సందేహం లేదు..

ఉద్దానం కిడ్నీ బాధితులపై పవన్ కళ్యాణ్ రూపొందించిన డాక్యూమెంటరీని కింద లింక్ లో చూడొచ్చు..

To Top

Send this to a friend