మంత్రివర్గ మార్పు.. కారణాలు..

– ఐదుగురు అవుట్.. 11 మంది ఇన్
చంద్రబాబు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. తన మంత్రివర్గం నుంచి ఏకంగా ఐదుగురిని తీసేసి.. 11 మంది కొత్తవారిని తీసుకున్నారు. ఇందులో ఇటీవలే ఎన్నికైన కొడుకు లోకేష్ తో పాటు చనిపోయిన భూమా నాగిరెడ్డి కూతురు అఖిల ప్రియకు మంత్రివర్గంలో చోటిచ్చారు.

కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న వారు..
1) కిమిడి కళా వెంకట్రావ్ (శ్రీకాకుళం), 2) సుజయకృష్ణ రంగారావు(విజయనగరం),3 పితాని సత్యనారాయణ (ప.గోదావరి), 4. జవహర్ (ప.గోదావరి), 5. నక్కా ఆనందబాబు (గుంటూరు), 6. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (నెల్లూరు), 7. నారాలోకేష్ (చిత్తూరు), 8.అమర్ నాథ్ రెడ్డి (చిత్తూరు), 9. కాల్వ శ్రీనివాసులు (అనంతపురం), 10. ఆది నారాయణ రెడ్డి (కడప), 11. భూమా అఖిల ప్రియ(కర్నూలు).

మంత్రివర్గం నుంచి తీసేసింది వీరినే..
1) బొజ్జ గోపాలకృష్ణారెడ్డి (చిత్తూరు), 2) పల్లె రఘునాథరెడ్డి (అనంతపురం), 3)రావెల కిషోర్ బాబు (గుంటూరు), 4) పీతల సుజాత(ప.గోదావరి), కిమిడి మృణాళిని (విజయనగరం)

ఈ ఐదుగురితో పాటు ఖాళీగా ఉన్న ఆరు స్థానాలను భర్తీ చేస్తూ మొత్తం 11 కొత్త ముఖాలకు చోటు ఇచ్చారు.

కేబినెట్ లో మార్పులు చేర్పులపై చంద్రబాబు నిన్న రాత్రియే తీవ్ర కసరత్తు చేశారు. తీసేయాలనుకుంటున్న ఐదుగురి మంత్రుల చేత రాజీనామాలు చేయించారు. కొత్త వారిని మంత్రులుగా తీసేయడానికి పోటీ నెలకొంది. టీడీపీకి చెందిన అగ్రెసివ్ ఎమ్మెల్యే బోండా ఉమ తనకు మంత్రి పదవి కావాలని చివరికంటా ప్రయత్నించారు. రాకపోవడంతో రాజీనామాకు సిద్ధమయ్యారు. స్వయంగా చంద్రబాబు ఫోన్ చేసి రామ్మని చెప్పినా రాలేదు. ఎంపీలు కొనకళ్ల నారాయణ, కేశినేని నాని తదితరులు ఉమను కలిసి చంద్రబాబు దగ్గరకు వెళ్లాలని సూచించినా ఆయన తిరస్కరించినట్టు సమాచారం. తన రాజీనామాతో పాటు 18 మంది విజయవాడ కార్పొరేటర్లు బోండా ఉమకు మంత్రి పదవి ఇవ్వనందుకు రాజీనామా చేయనున్నట్టు తెలిసింది. దీంతో ఉమ ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక తమకు మంత్రి పదవులు తీసేసినందుకు బొజ్జల, పీతల సుజాత లు మనస్తాపం చెందారు.

రెండేళ్లలో ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో జిల్లాల్లో బలమైన రాజకీయ నాయకత్వం సమీకరణాల పరంగా సమతూకం ఉండాలన్న లక్ష్యంతో చంద్రబాబు తన కొత్త మంత్రులను సామాజిక, రాజకీయ అంశాలను అనుసరించి ఎంపిక చేసుకున్నారు. ప్రత్యేకించి రాయలసీమలో ఆయన ఆదిశగా కసరత్తు చేశారు. కడపలో వైసీపీని ధీటుగా ఎదుర్కోవాలన్న యోచనతోనే ఆదినారాయణ రెడ్డి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో చురుకైన రాజకీయ నాయకత్వాన్ని ఇవ్వాలన్న కోణంలోనే సోమిరెడ్డి, అమర్ నాథ్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అంతేకాకుండా మంత్రివర్గ విస్తరణలో రాయలసీమలో బీసీల ప్రాతినిధ్యాన్ని పెంచాలన్న యోచనతోనే అనంతపురం జిల్లా నుంచి కాల్వ శ్రీనివాసులను ఎంపిక చేశారు.

ఉత్తరాంధ్రలో బీసీల్లో బలమైన సామాజికవర్గం నుంచి కళా వెంకట్రావును, విజయనగంరలో ధీటైన నాయకత్వంతో కోసం సుజయ రంగారావును ఎంచుకున్నారు. కర్నూలులో భూమా కుటుంబానికి జరిగిన అన్యాయంపై అఖిలప్రియకు ఇచ్చారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాల్లో బీసీ వర్గానికి చెందిన పితాని సత్యనారాయనను, ఎస్సీల్లో మాదిగ సామాజిక వర్గానికి చెందిన జవహర్ ను తీసుకున్నారు. ఇలాగా బీసీలు, ఎస్సీలు , సీనియర్లు, యువతకు ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారా తన మంత్రివర్గానికి సమతూకాన్ని చంద్రబాబు ఇవ్వగలిగారు..

To Top

Send this to a friend