‘భూమా’ మరణానికి కారకులెవరు..?

ఏదైతేనేం.. ఒక మహానేత మహాభినిష్ర్కమణం జరిగిపోయింది. పేదల పెన్నిధిగా చివరి వరకు పోరాడిన భూమా నాగిరెడ్డి విషాదకర రీతిలో అస్తమించారు. గుండెపోటుతో మరణం సంభవించింది. కానీ ఆ గుండెపోటుకు కారణం ఎవ్వరు..? ఆయన్ను రాజకీయంగా కేసుల పేరుతో ఇబ్బంది పెట్టిందెవరు..? ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి ఆయన అధికార పార్టీ చెంతకు చేరేలా అష్టదిగ్బంధనం చేసిందెవరు..? చివరకు చేరాక మంత్రి పదవి హామీ ఇచ్చి మోసం చేసిందెవరు..? తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భూమా నాగారెడ్డి శత్రువు, ప్రత్యర్థినే నిలబెట్టి ఆయన్ను మానసిక క్షోభకు గురిచేసింది ఎవరు..? చివరాఖరున ఆయన చనిపోవడానికి ఒక్కరోజు ముందు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. అందులో బాబుకు, భూమాకు మధ్య జరిగిందేమిటీ.? సంవాదమా.. ఒత్తిడా.? ఇవన్నీ ప్రశ్నలు.. కానీ వీటికి సమాధానాలు ఒకటీ భూమా చెప్పాలి.. ఆయన లేరు కనుక ఆయనతో గడిపిన వారు.. చెప్పాలి. అది ఎప్పటికీ జరగదు.. సో.. గొప్ప నేతను ఈ అవకాశవాద రాజకీయాలు కనుమరుగు చేశాయి. రాజకీయాల్లో ఎంతో ఓర్పు, నేర్పు, కుటిలనీతి, కలుపుకోలు తనం ఉండాలి. ప్రత్యర్థులను సైతం మిత్రులుగా భావించే మనస్తత్వం ఉండాలి. జనం కోసం పోరాడితే సరిపోదు.. ఈ కుతంత్ర రాజకీయాల్లో ఎంతో గుండె నిబ్బరం అవసరం.. అదీ లేక భూమా పరమపదించారు..

* కేసుల భయంతోనే టీడీపీలోకి..
భూమా నాగిరెడ్డి ప్రజారాజ్యం వీడి వైసీపీలో చేరారు. కర్నూలు జిల్లాలో కింగ్ మేకర్ అయ్యారు. ఆయన భార్య బతికి ఉన్నన్నీ రోజులు చాలా చాకచక్యంగా రాజకీయాలు నడిపారు. కానీ భార్య ప్రమాదంలో మృతి ఆయన్ను కృంగదీసింది. కోలుకోకుండా చేసింది. ఏకుమేకులా ఉన్న భూమాను టీడీపీ నాయకులు ఇదే అదునుగా దెబ్బకొట్టారు. ఎర్రచందనం,, పాతకక్ష్యలు, గొడవలు, హత్య కేసులు సహా చాలా కేసులు బనాయించారు. ఉక్కిరిబిక్కిరి చేశారు. జైలు పాలు చేశారు. దీంతో భూమా ఈ కేసులు భయంతోనే వైసీపీని వీడి టీడీపీలో చేరారు. మంత్రిపదవి ఇస్తానన్న బాబు హామీతో అన్నీ వదిలేసి మనసు ఒప్పకున్నా టీడీపీలో చేరారు. కానీ చివరకు గవర్నర్ వైసీపీ నుంచి చేరినవాళ్లకు మంత్రి పదవులు ఇవ్వవద్దని నిర్ణయించడం.. దానికి చంద్రబాబు సరేననడంతో ఆయన మంత్రి పదవిఆశ నీరుగారిపోయింది. ఇది ఆయన్ను చాలా మానసిక వేదనకు గురిచేసింది. బాబు మంత్రాంగంలో బలి అయిపోయానని భూమాకు అర్థమైంది. కానీ ఏం చేస్తే సర్దుకుపోయారు.

*ప్రత్యర్థి కోసం పనిచేయమనడంతో మనస్థాపం..
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు భూమాను తీవ్ర మనసిక వేదనకు గురిచేశాయి. కర్నూలులో తాను వైసీపీలో ఉన్నప్పుడు ప్రత్యర్థిగా.. రాజకీయంగా తీవ్రంగా విభేదించే వ్యక్తికే చంద్రబాబు టికెట్ కట్టబెట్టారు. పైగా ఆ గెలుపు బాధ్యతను భూమా నెత్తిన వేశారు. ఇవన్నీ నాగిరెడ్డిని తీవ్ర మనస్తాపానికి గురిచేశాయి. శత్రువును గెలిపించేందుకు ఆయన మనసు చంపుకొని పనిచేశారు. ఇదీ ఆయన్ను తీవ్రంగా బాధించింది..

* చనిపోవడానికి ఒక్కరోజు ముందు..
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా భూమా చనిపోవడానికి ఒక్కరోజు ముందు చంద్రబాబును కలిశారు. టీడీపీ అభ్యర్థికి మద్దతిస్తున్న జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లను వెంటబెట్టుకొని బాబును కలిశారు. అక్కడే మంత్రివర్గ విస్తరణ అంశం చర్చకొచ్చింది. భూమాకు మంత్రి పదవి ఇప్పట్లో రాదని బాబు స్పష్టం చేశారట.. పైగా కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గెలుపు కోసం పనిచేయాలని కోరారట.. దీంతో అటు పదవి దక్కక.. ఇటు శత్రువును గెలిపించే బాధ్యత మీద పడడం కలవరపరించిందని సమాచారం. అందుకే ఆయన ముభావంగా ఇంటికి చేరినట్టు కుటంబ సభ్యులు తెలిపారు..

*భార్య శోభ పక్కన నా ఫొటో బాగుంటుంది..
చంద్రబాబును కలిసి రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి చేరిన నాగిరెడ్డి ఎదురుగా శోభ ఫొటోను చూసి వేదనకు గురయ్యాడు. తన భార్య పక్కన తన ఫొటో ఉంటే బాగుంటదని సూచించారు. ఈ రాజకీయాల్లో శోభ లేకుంటే అంగవైకల్యం వచ్చిన వాడిలా అవిటివాడినైపోతున్నానని బాధపడ్డాడు. అదే రోజు రాత్రి పడుకోవడం.. తెల్లవారుజామున గుండెపోటు రావడం.. ఆయన మరణించడం జరిగిపోయాయి.. సో.. ఇప్పుడు చెప్పండి.. ఆయన మరణానికి కారకులెవరు..?

To Top

Send this to a friend