భీమవరం టాకీస్ హారర్ ఎంటర్ టైనర్ “శివగామి”

భీమవరం టాకీస్ బ్యానర్ పై  రమేష్ కుమార్ జైన్ సమర్పణలో..  మనీష్ ఆర్య, ప్రియాంక రావు హీరోహీరోయిన్స్ గా..  సుమంత్ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మిస్తున్న హారర్ ఎంటర్ టైనర్ “శివగామి” పాటలు ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదలయ్యాయి.  ప్రముఖ దర్శకులు ఎస్.వి.కృష్ణారెడ్డి-ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి “శివగామి” ఆడియోను ఆవిష్కరించి.. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్- ప్రముఖ దర్శకులు ఓం సాయి ప్రకాష్ లకు అందించారు. దీనికి ముందు ఒక్కో పాటను ఒక్కో అతిధి విడివిడిగా విడుదల చేశారు.

ఎం.ఎస్. త్యాగరాజ్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి భారతీబాబు పాటలు రాశారు. చిత్ర దర్శకులు సుమంత్, చిత్ర సమర్పకులు రమేష్ కుమార్ జైన్, చిత్ర కథానాయకుడు మనీష్ ఆర్య, కన్నడ నిర్మాత రాజశేఖర్, బావాజీలతోపాటు..  ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు గజల్ శ్రీనివాస్, నిర్మాత మోహన్ గౌడ్, గీత రచయిత భారతీబాబు, ఈ చిత్రంలో ఒక గీతాన్ని ఆలపించిన కుమారి సంస్కృతి,  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శివ.వై ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ.. “కన్నడ, తెలుగు భాషల్లో నాలుగు కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రమిది. ఇటీవలకాలంలో వఛ్చిన హారర్ చిత్రాల్లో అగ్రగామిగా “శివగామి” నిలుస్తుంది. ఈ కార్యక్రమానికి దాసరిగారు రావాల్సి ఉంది.  కానీ ఊర్లో లేకపోవడం వల్ల వీడియో ద్వారా ఆశీస్సులు అందించారు. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సి,కళ్యాణ్, ఓం సాయిప్రకాష్ వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి వచ్చి ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది. అతి త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.

వక్తలంతా “శివగామి” చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించి..  పాటలు, ప్రచార చిత్రాలు చాలా బాగున్నాయని ప్రశంసించారు. “శివగామి” చిత్రంతో తెలుగులోకి పరిచయం అవుతుండడం పట్ల చిత్ర దర్శకులు సుమంత్, సంగీత దర్శకులు త్యాగరాజ్, కథానాయకుడు మనీష్ ఆర్య, చిత్ర సమర్పకులు రమేష్ కుమార్ జైన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శివ వందన సమర్పణ చేశారు. గుజరాత్ లో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందిందని, కన్నడలో ప్రముఖ సంగీత దర్శకులు గురుకిరణ్ ఈ చిత్రానికి నేపధ్య సంగీతం సమకూర్చడం విశేషమని, ఈ చిత్రంలో నటించిన బేబీ సుహాసిని కన్నడ స్టేట్ అవార్డు విన్నర్ అని ఆయన తెలిపారు.  సీనియర్ నటీమణి  సుహాసినీ మణిరత్నం  ఓ ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎస్.త్యాగరాజ్, సమర్పణ: రమేష్ కుమార్ జైన్, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుమంత్ !!

To Top

Send this to a friend