భజన భక్తుడు: దేవాన్ష్ ది కూడా పెట్టుకోపోయావా.?


నీ భజన తగలేయా.. నీ కంటే చిన్నోడి ఫొటో పెట్టుకోవడానికి ఎలా మనసు వచ్చిందయ్యా నారాయణ.. ఇప్పుడు సోషల్ మీడియా మంత్రి నారాయణ భజన భక్తికి సెటైర్లు పడుతున్నాయి. ఏపీ మంత్రి నారాయణ తన కార్యాలయంలో ఎన్టీఆర్ , చంద్రబాబుల ఫొటో పక్కన లోకేష్ ఫొటో పెట్టుకోవడం వివాదాస్పదమైంది.

ఎన్టీఆర్ తెలుగు దేశం స్థాపకుడు ఓకే.. ఆయనది పెట్టాల్సిందే.. చంద్రబాబు పార్టీని నడిపిస్తున్న ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఫొటో తప్పనిసరి..కానీ కనీసం ఎన్నికల్లో ఇప్పటివరకు పోటీచేయకుండా దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయిన లోకేష్ ను.. నారాయణ కంటే చాలా అన్నిరంగాల్లో చిన్నోడు అయిన లోకేష్ ఫొటో పెట్టడం దుమారం రేపుతోంది. నారాయణ స్వామి భక్తిని నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. లోకేష్ బాబు పక్కన ఆయన కొడుకు దేవాన్ష్ ఫొటో కూడా పెట్టుకోపోయావా నారాయణ అంటూ ఆడిపోసుకుంటున్నారు..

To Top

Send this to a friend